
నెల్లూరులో దారుణం..జంట హత్యలు
ఇద్దరు యువకులను గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు
నెల్లూరు పట్టణంలో జంట హత్యలు కలకలం రేపాయి. రంగనాయకులపేట తిక్కన పార్కు ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో పట్టణం ఉలిక్కి పడింది. ఇద్దరు గుర్తుతెలియని యువకులు దారుణహత్యకు గురయ్యారు.ఇద్దరు యువకులని దుండగులు కర్రలతో కొట్టిచంపి, పెన్నానదిలో పడేశారు.అటుగా వెళ్తున్న స్థానికులు మృతదేహాలను చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రైమ్ స్పాట్‌ను పరిశీలించారు.సంఘటన స్థలంలో విరిగిన కర్రలు, రక్తపు మరకలు గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. గ్రూపుల మధ్య పాతకక్ష్యలే కారణమనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.మృతులు ఎవరు ,ఎక్కడి వారనే సమాచారం తెలియాల్సివుంది.
Next Story