దానం రాజీనామాకు డిమాండ్
x

దానం రాజీనామాకు డిమాండ్

ఈ రెండు కారణాలను చూపించి బీఆర్ఎస్ ఎంఎల్ఏలు దానం రాజీనామాకు బాగా పట్టుబడుతున్నారు.


ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ గట్టిగా పట్టుబడుతోంది. దేనికంటే ఫిరాయింపు ఎంఎల్ఏ దానం నాగేందర్ రాజీనామా కోసం. ఎందుకంటే ఇందుకు రెండు కారణాలున్నాయి. మొదటిదేమో దానం బీఆర్ఎస్ తరపున ఖైరతాబాద్ లో గెలిచి తర్వాత కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. ఇక రెండో కారణం ఏమిటంటే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంఎల్ఏల్లో కొందరిని ఉద్దేశించి దానం బూతులు తిట్టారు. సో, ఈ రెండు కారణాలను చూపించి బీఆర్ఎస్ ఎంఎల్ఏలు దానం రాజీనామాకు బాగా పట్టుబడుతున్నారు.

పార్టీ ఫిరాయింపులన్నవి ఇపుడు కామన్ అయిపోయాయి. పైగా ప్రత్యేక తెలంగాణా ఏర్పడిన తర్వాత పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ అని అందరికీ తెలుసు. టీడీపీ, కాంగ్రెస్ ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంఎల్సీలను పెద్దఎత్తున బీఆర్ఎస్ లోకి లాక్కున్నదే కేసీఆర్. ప్రజా ప్రతినిధులను లాక్కోవటమే కాకుండా అందులో కొందరికి మంత్రిపదవులు కూడా ఇచ్చారు. కాబట్టి ప్రజా ప్రాతినిధ్య చట్టం తెలంగాణాలో బాగా అపహాస్యమైందన్నది వాస్తవం. అప్పట్లో బాధిత కాంగ్రెస్ పార్టీ ఇపుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి కేసీఆర్ నే ఫాలో అవుతోంది. కాబట్టి ఇందులో కాంగ్రెస్ ను తప్పుపట్టాల్సిందేమీ లేదు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎంఎల్ఏలు ఎంత మొత్తుకున్నా రేవంత్ రెడ్డి లెక్క కూడా చేయరు.

ఇక రెండో కారణం అసెంబ్లీలో దానం బూతులు తిట్టడం. బీఆర్ఎస్ ఎంఎల్ఏలను దానం తిట్టేటపుడు మైక్ ఆన్ లో ఉంది కాబట్టి ఎంఎల్ఏ తిట్టింది స్పష్టంగా వినబడింది. ఆ విషయంలోనే బీఆర్ఎస్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి ఫిరాయింపు ఎంఎల్ఏ రాజీనామాకు గట్టిగా పట్టుబడుతున్నారు. అసెంబ్లీలో తిట్టుకోవటాన్ని ఎవరూ సమర్ధించరు. అయితే బీఆర్ఎస్ ఎంఎల్ఏ రాజీనామా కోసం పట్టుబడితే రేవంత్ పట్టించుకుంటారా ?

Read More
Next Story