తమ్ముడూ, ఈ రాక్షసుణ్ణి భరించలేక చచ్చిపోతున్నా!
x

తమ్ముడూ, ఈ రాక్షసుణ్ణి భరించలేక చచ్చిపోతున్నా!

నేను చచ్చిపోతున్నా, నా పిల్లల్ని బాగా చూడండ్రా!


ఓ అక్క తన తమ్ముడికి రాసిన ఆవేదనాభరిత సందేశం అది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లి గ్రామానికి చెందిన తోట ఝాన్సీ తన తమ్ముడికి ఓ సందేశం పంపి బలవన్మరణానికి పాల్పడ్డారు. తన కుమార్తె ఝూన్సీ భర్త వేధింపులు భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తండ్రి ముదరకొల ప్రభుదాసు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

భీమవరం మండలం వెంప గ్రామ శివారు కొత్తపేటకు చెందిన ఝాన్సీకి 13 ఏళ్ల క్రితం యలమంచిలి మండల మేడపాడు వాసి టి.దుర్గాపెద్దిరాజులకు 13 ఏళ్ల కిందట వివాహం జరిగింది. కుటుంబ తగాదాల కారణంగా వీరు పాలకొల్లు మండలం పూలపల్లిలో వేరు కాపురం పెట్టారు. భర్త పెద్దిరాజు కొద్దికాలం నుంచి మద్యానికి బానిసై తరచూ భార్యను హింసించేవాడు. భార్యను అనుమానిస్తూ తిడుతూ, కొడుతూ మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టారు.
ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి పెద్ది రాజు బాగా తాగివచ్చి భార్యను కొట్టాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో ఆమె ‘భర్త వేధింపులు భరించలేకపోతున్నా.. పిల్లలను బాగా చూసుకోండి’ అంటూ తన తమ్ముడు ఫోన్ కి సందేశం పెట్టి బలవన్మరణానికి పాల్పడినట్టు ఝూన్సీ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఝాన్సీ గదిలో ఫ్యాన్‌కు చీర వేలాడుతూ కనిపించిందని ఆమె తండ్రి ప్రభుదాసు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు చేశారు. ఝూన్సీ భర్త పెద్దిరాజు, మామ వీరభద్రరావు, అత్త సత్యవతిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Read More
Next Story