తెగిన రాఖీ బంధం
x

తెగిన రాఖీ బంధం

భవ బంధాలు అంటారు. ఇవి మాయేనని ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇప్పుడన్నీ ఆర్థిక సంబంధాలేనని తేలిపోయింది.


అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల బంధానికి బంధానికి రాఖీ పండుగ ప్రతీక చిరకాలం కలిసి ఉండాలని, సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ చెల్లెళ్లు, అక్కలు రాఖీలను తమ్ముళ్లు, అన్నలకు కడుతుంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు బంధాలకు ప్రతీకగా ఉండే అన్నా చెల్లెళ్లు అధికారం, ఆస్తుల కోసం విడిపోయారు. ఎంత దూరం జరిగారంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు. అన్నా చెల్లెళ్ల బంధానికి నీళ్లొదిలారు. వీరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన చెల్లెలు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డిలు. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఈ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది. కుటుంబ సభ్యులంతా అన్యోన్యంగా కలిసి ఉండేవారు. సంతోషంగా గడిపే వారు. ఆ సంతోషాలు, అనురాగాలు ఒక్కసారిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే పోయాయి.

ఎందుకు అంత దూరం అయ్యారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన చెల్లెలు షర్మిలకు ప్రభుత్వంలో పదవులు ఇచ్చేందుకు ఇష్టపడలేదు. ఈ విషయంలో ఆయన చెప్పింది ఒక్కటే.. ఒకే జనరేషన్ లో ఒకే ఇంటి నుంచి ఒకరి కంటే ఎక్కువ మంది ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులుగా వద్దన్నారు. అదే విషయాన్ని చెల్లెలుకు చెప్పారు. ఆమె మాత్రం కనీసం తనకు రాజ్యసభ అయినా ఇస్తారని ఆశించారు. అవేవీ జరగలేదు. పదవులు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పనందునే నా చెల్లెలు నాకు దూరమైందని నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలలో చెప్పారు.

ఈ విషయంలో జనం మాటేమిటో తెలుసా...

నేను నా చెల్లెలు ఒకే జనరేషన్ కాబట్టి పదవులు ఇవ్వ వద్దనుకున్నారు. అయితే వైఎస్ఆర్ సతీమణి, వైఎస్ జగన్ అమ్మ వైఎస్ విజయమ్మ వైఎస్సార్ చనిపోగానే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది అసెంబ్లీలో హుందాగా వ్యవహరించారని, మాటకారి కూడా కావడంతో ఆమెకు రాజకీయ భవిష్యత్ ఉందని అందరూ అనుకున్నారు. కానీ జగన్ విజయమ్మను కూడా రాజకీయంగా ఎదగనివ్వలేదనే విమర్శలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్న తనకు కనీసం సమాచారం లేకుండా తన పేరుపై ప్రకటనలు విడుదలయ్యేవని, పత్రికలు, ప్రసార సాధనాల్లో చూసిన తరువాతనే తనకు తెలిసేదని, అందుకే ఆ పదవి కూడా తనకు వద్దని చెప్పి తప్పుకున్నట్లు అనేక సార్లు విజయమ్మ చెప్పారు. ఇక అప్పటి నుంచే విజయ్మ, షర్మల జగన్ తో డిఫర్ అయ్యారు. ఆ తరువాత జరిగిన పరిణామాలు చూస్తూనే ఉన్నాం.

రాఖీ బంధానికి తెగదెంపులు

ఇప్పటి వరకు అన్న జగన్ కు రాఖీ పండుగ రోజు చెల్లెలు షర్మిల రాఖీ కట్టేంది. ఎంతో సంతోషంగా ఆ రోజు గడిచేది. స్నేహితులు, ప్రత్యేక వంటకాలు ఇలా గడిపే వారు. గత సోమవారం జరిగిన రాఖీ పండుగకు చెల్లెలు షర్మిల జగన్ ఇంటికి రాలేదు. ఎక్కడా ఆమె కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజీవ్ జయంతి ఏర్పాట్లు చూశారు. అధికారం చేపట్టగానే జగన్ మోహన్ రెడ్డి మారిపోయారని, నియంతగా వ్యవహరిస్తున్నారని పలు మార్లు షర్మిల చెప్పారు. ఇకపై నా అన్న కుటుంబంతో నాకు సంబంధం లేదని, నా పిల్లలు భర్తే నాకుటుంబమని చెప్పడం విశేషం. జగన్ కూడా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఇకపై నా భార్యా పిల్లలే నాకుటుంబమని ప్రకటించారు.

విజయమ్మ ఒంటరి అయినట్లేనా...

అన్నా చెల్లెళ్ల మధ్య తల్లి నలిగిపోతోంది. ఒకింత షర్మిలతోనే విజయమ్మ ఉన్నారు. అప్పుడప్పుడూ జగన్ ను కూడా కలుస్తున్నారు. ఇప్పుడు ఇరువురూ వేరు వేరు పార్టీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాయకత్వం వహిస్తున్నారు. వీరితో కలిసి ఉండేందుకు కూడా విజయ్మ ఇష్టపడటం లేదని సమాచారం. ఒంటిరిగానే ఇంటిలో ఉండటంతో పాటు అవకాశం వచ్చినప్పుడల్లా బంధువుల ఇళ్లకు వెళ్లి రావడం వంటివి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది.

Read More
Next Story