ఏపీలో 2019 నుంచి 2024 వరకు బ్రిటీష్‌ పాలన
x

ఏపీలో 2019 నుంచి 2024 వరకు బ్రిటీష్‌ పాలన

కాకినాడలో స్వాతంత్య్ర వేడుకల కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి 2024 వరకు బ్రిటీష్‌ పాలన మాదిరిగా నాటి ప్రభుత్వ పాలన సాగిందని వైసీపీ మీద, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. కాకినాడలో నిర్వహించిన 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చేసిన ఓటు చౌర్యంపై స్పందించారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ప్రతిపక్షాలు ఓటు చోరీ అంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిచినప్పుడు ఒక న్యాయం.. ఓడినప్పుడు ఒక న్యాయమా? అంటూ ప్రశ్నించారు. గత ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు గొంతెత్తాలంటే భయపడేవారని, వారిపైన దాడులు జరిగేవని విమర్శించారు. అవినీతికి అలవాటు పడిన వైసీపీ వాళ్లు ఏమైనా చేస్తారని మండిపడ్డారు. అయితే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాల్లో మహిళలకు ప్రత్యేక స్థానం కల్పిస్తున్నట్లు తెలిపారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని నేడు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఎంతో మంది మహానుభావుల త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్య్రమని, స్వాతంత్య్ర సమరయోధులందరిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Read More
Next Story