కడప జిల్లా బౌద్ద ఆనవాళ్ల  మీద పుస్తకం విడుదల
x

కడప జిల్లా బౌద్ద ఆనవాళ్ల మీద పుస్తకం విడుదల

బుద్దిస్ట్ కల్చర్ సొసైటీ ఆధ్వర్యంలో పిళ్లా కుమార స్వామి సంకలనం చేసిన "ఉమ్మడి కడప జిల్లాలో బౌద్ధ ఆరామాలు" అనే గ్రంధాన్ని ఇంటాక్ కడప చాప్టర్ అధ్యక్షులు చిన్నపరెడ్డి యూటీఎఫ్ భవనంలో జరిగిన సమావేశంలో ఆవిష్కరించారు.


బుద్దిస్ట్ కల్చర్ సొసైటీ ఆధ్వర్యంలో పిళ్లా కుమార స్వామి సంకలనం చేసిన "ఉమ్మడి కడప జిల్లాలో బౌద్ధ ఆరామాలు" అనే గ్రంధాన్ని ఇంటాక్ కడప చాప్టర్ అధ్యక్షులు చిన్నపరెడ్డి యూటీఎఫ్ భవనంలో జరిగిన సమావేశంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బుద్దిస్ట్ కల్చరల్ సొసైటీ అధ్యక్షులు పిళ్లా కుమార స్వామి అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలో సాధారణ శకం ముందు రెండవ శతాబ్దం శతాబ్దంలోనే బౌద్ధం అప్పటి రేనాటి సీమలో ఇప్పటి ఉమ్మడి కడప జిల్లాలో పరిఢవిల్లిందని ఇక్కడి ప్రజలంతా అప్పుడు బౌద్ధాన్ని ఆచరించినారని, ఇక్కడ అప్పట్లో కులాలు లేకుండా జీవించారని, తర్వాత కాలంలోనే బౌద్ధాన్ని తరిమేసినారన్నారు. ఆ నాటి బౌద్ధం పునాదులపైనే నేటి సమాజం ఉందన్నారు.

మనం చరిత్రను తెలుసుకోకపోతే చరిత్రను సృష్టించలేమని ఆయన అన్నారు. డాక్టర్ అమీర్ , డాక్టర్ అశోక్ కుమార్ రాబర్ట్ హార్ట్ మొదలైన వారు రాయలసీమలో పర్యటించినప్పుడు రాసిన వ్యాసాలన్నీ ఇందులో ఉన్నాయని చెప్పారు. కడప జిల్లాలో చారిత్రక వారసత్వ సంపదను రక్షించడానికి వాటిని వెలుగులోకి తీసుకురావడానికి ఇంటాక్ సంస్థ కృషి చేస్తుందని ఆ సంస్థ అధ్యక్షుడు చిన్నపరెడ్డి పుస్తకావిష్కరణ చేస్తున్న సందర్భంలో చెప్పారు ఈ పుస్తకం కడప వాసులకు తమ చరిత్రను అర్థం చేసుకోవడానికి వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యతను తెలియజేస్తుందని ఈ పుస్తకం తీసుకురావడం చాలా అభినందనీయమని అన్నారు.





పుస్తకాన్ని పరిచయం చేస్తూ డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ కడప ఒకనాటి రేనాటి సీమ అని దానిని రేనాటి వారు పరిపాలించే వారిని అది ఒకప్పుడు ప్రసిద్ధ జనపదమని, ఇక్కడ కూడా బౌద్ధం, నందలూరు కాజీపేట జమ్మలమడుగు దానవులపాడు మొదలైన ప్రదేశాలలో పుష్పగిరి తాళ్లపాక లాంటి ప్రసిద్ధ ప్రదేశాలలో బౌద్ధం విరాజిల్లిందని, అయితే వాటి చారిత్రక వాస్తవాలను పక్కనపెట్టి అక్కడ ఉన్న బౌద్ధ పాదాలను, విష్ణు పాదాలు గా భావిస్తున్నారు. అలాగే బౌద్ధ స్తూపాలను ధ్వంసం చేస్తున్నారని అక్కడున్న ఇటుకలను తవ్వి వాటిని ధ్వంసం చేసి తమ ఇల్లు కట్టుకునే విధంగా ప్రజలు చేస్తున్నారు. దీనివల్ల మన చరిత్రక సత్యాలు మరుగున పడిపోయి మన వారసత్వం మనకే తెలియకుండా పోతుంది.

కడప జిల్లాలో పుట్టిన ప్రతి ఒక్కరూ తమ పూర్వీకుల చరిత్రను పుక్కిటి పురాణాల మీద కాకుండా, శాస్త్రీయ ఆధారాల ఆధారంగా తెలుసుకోవాలని ఆయన కోరారు. ఇప్పటి వర్తమాన పరిస్థితుల్లో బౌద్ధం గురించి మాట్లాడటం, బౌద్ధం గురించి ప్రచారం చేయడం పెద్ద సాహసమైన కార్యక్రమమని, ఇది ఒక చారిత్రక ఘట్టమని డాక్టర్ సుధాకర్ అన్నారు. ఇదే పనిని ఉత్తర భారత దేశంలో చేస్తే, చేసేవారిని అక్కడ కొడతారని అలాంటి అసాంఘిక పరిస్థితులు దేశంలో ఉన్నాయని వీటిని మనం ఎదుర్కోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసులు యుటిఎఫ్ నాయకులు మహేష్, బుద్దిస్ట్ కల్చర్ సొసైటీ కార్యదర్శి ప్రసాద్ ,ఉపాధ్యక్షులు మల్లెల భాస్కర్, ఇంటాక్ సభ్యులు రాణి, కృష్ణ లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెంకటసుబ్బయ్య మొదలైన వారు పాల్గొన్నారు.

Read More
Next Story