ప్రజల ఆకాంక్షలను గౌరవించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు
x

ప్రజల ఆకాంక్షలను గౌరవించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు

రాయలసీమ ప్రజల ఆశలను, ఆకాంక్ష అయిన సిద్దేశ్వరం అలుగు నిర్మాణం పట్ల కార్యాచరణ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.‌


రాయలసీమ ప్రజల ఆశలను, ఆకాంక్ష అయిన సిద్దేశ్వరం అలుగు నిర్మాణం పట్ల కార్యాచరణ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.‌ ఈ సందర్భంగా గురువారం నంద్యాల సమితి కార్యాలయంలో బొజ్జా మాట్లాడుతూ.. రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచ దృష్టికి తీసుకుపోవడానికి, శ్రీశైలం రిజర్వాయర్‌లో రాయలసీమకున్న నీటి హక్కులను వినియోగించుకునే లక్ష్యంతో సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన చేపట్టిన విషయం అందరికి తెలిసిందే అని వివరించారు.


సిద్దేశ్వరం అలుగు నిర్మాణం వలన శ్రీశైలం రిజర్వాయర్‌లో పూడిక చేరడం నివారించి శ్రీశైలం జీవిత కాలాన్ని పెంచుతుందన్న విషయాన్ని ప్రజా సంఘాలు విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించారని పేర్కొన్నారు. ఈ అలుగు నిర్మాణం వల్ల శ్రీశైలం ప్రాజెక్టుకు రక్షణగా ఉంటుందని ఇది తక్కువ ఖర్చుతో నిర్మించవచ్చని దీనికి భూసేకరణ కూడా అవసరం లేదన్న విషయాన్ని ప్రజల ముందు ఉంచడంలో రాయలసీమ ప్రజాసంఘాలు విస్తృతంగా పనిచేసాయని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు చట్టబద్ధమైన నిర్వహణతో రాయలసీమ నీటి హక్కులను పొందడంలో సిద్దేశ్వరం అలుగు ఆవశ్యకతను కూడా ప్రజా సంఘాలు ప్రజల ముందు స్పష్టంగా ఉంచడంలో విజయం సాదించాయని పేర్కొన్నారు.‌




"రాయలసీమ సాగునీటి సాధన సమితి మరియు రాయలసీమ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో "సిద్దేశ్వరం అలుగు - రాయలసీమకు వెలుగు" అన్న నినాదంతో" 30 వేల మందికి పైన రాయలసీమ ప్రజలు ప్రభుత్వ నిర్బంధాలు ఎదిరించి స్వచ్ఛందంగా కదిలి వచ్చి మే 31, 2016 న శంకుస్థాపన చేసిన విషయాన్ని బొజ్జా గుర్తు చేశారు. ఈ చారిత్రాత్మక ఘట్టం రాజకీయ పార్టీలు రాయలసీమ వైపు చూసే దిశగా మరల్చిందని చెప్పారు. దీనితో అనేక రాజకీయ పార్టీలు సిద్దేశ్వరం అలుగు నిర్మాణంకు మద్దతు ప్రకటించడం తెలిసిందే అని వివరించారు.

"సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన నుండి ప్రతి సంవత్సరం మే 31న సిద్దేశ్వరం అలుగే సాధనగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలను రాయలసీమ ప్రజా సంఘాలు నిర్వహిస్తున్నాయి. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా" ప్రజా గళం కార్యక్రమంలో నారా లోకేష్ బాబు గారు సిద్దేశ్వరం అలుగు నిర్మాణంపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడం, అదేవిధంగా 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు సిద్దేశ్వరం అలుగు నిర్మాణం అంశాన్ని పరిశీలిస్తానని ప్రకటించడాన్ని బొజ్జా గుర్తు చేసారు.




తెలుగు దేశం నేతృత్వంలో ఎన్ డి ఏ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత బిలబిల పొంగి పొర్లుతున్న కృష్ణమ్మకు హారితి నిచ్చే సందర్భంగా ముఖ్యమంత్రి గారు కల్వకుర్తి నంద్యాల మధ్యన నిర్మిస్తున్న జాతీయ రహదారిలో భాగంగా సిద్దేశ్వరం వద్ద నిర్మిస్తున్న ఐకానిక్ బ్రిడ్జి తో పాటుగా రాయలసీమ ప్రాంత నీటి అవసరాలను తీర్చడానికి అలుగు నిర్మాణం చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి సాధిస్తామని ప్రకటించడాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆహ్వానిస్తున్నది.

Read More
Next Story