బయో వ్యర్థాలను 48 గంటల్లోగా డిస్పోజ్ చేయాల్సిందే
x

బయో వ్యర్థాలను 48 గంటల్లోగా డిస్పోజ్ చేయాల్సిందే

పొల్యూషన్ కంట్రోల్ బోర్డుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు.


అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను డిస్పోజ్ చేసేందుకు ఓ విధాన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో సహా వివిధ శాఖల అధికారులతో సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి. గాలి, నీరు, ఇండస్ట్రీయల్ వేస్ట్, బయో వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ వంటి వాటిల్లో వివిధ రకాల అధ్యయనం చేయాలి. ఇందు కోసం టెక్నాలజీని వినియోగించాలి. ఎవరైనా నియమాలను అతిక్రమిస్తే... సదరు సంస్థలు.. వ్యక్తులకు ముందుగా హెచ్చరికలు జారీ చేసి ఆ తర్వాత చర్యలు తీసుకోవాలి. ఇక ప్రత్యేకంగా ప్లాస్టిక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించేలా అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. వివిధ వ్యర్ధాలను సర్య్కలర్ పాలసీకి అనుసంధానం చేయాలి. ఇక ప్రత్యేకంగా బయో వేస్ట్ డిస్పోజల్స్ విషయంలో ఏ మాత్రం అలక్ష్యం వహించవద్దు. మొత్తంగా 15,526 హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉన్నాయి... వీటి ద్వారా వచ్చే బయో వ్యర్థాలను 48 గంటల్లోగా డిస్పోజ్ చేయాల్సిందే. దీన్ని కచ్చితంగా పాటించాలి. పర్యవేక్షణకు టెక్నాలజీని... సీసీ టీవీలను వినియోగించాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు.

ఎయిర్ క్వాలిటీని విశ్లేషించండి
‘ఎయిర్ క్వాలిటీని అన్ని కోణాల్లో విశ్లేషించాలి. ఎయిర్ క్వాలిటీ సిస్టం మానిటరింగ్ కోసం లేటేస్ట్ టెక్నాలజీని వినియోగించుకోవాలి. ఆ డేటాను అవేర్ – 2.0కు లింక్ చేయాలి. దీన్ని అవేర్-2.0 వ్యవస్థకు అనుసంధానం చేయాలి. ఇక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను దృష్టిలో పెట్టాలి. ఈ మేరకు అనుమతులిచ్చేందుకు అవసరమైన మార్పులు చేపట్టాలి. రెడ్ జోన్ పరిధిలో ఉన్న పరిశ్రమలకు 12 రోజులు, ఆరేంజ్ జోన్ పరిధిలో ఉన్న పరిశ్రమలకు 10 రోజులు, గ్రీన్ జోన్‌లో ఉన్న పరిశ్రమలకు 3 రోజుల్లో అనుమతులు ఇవ్వాలి. సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లు అన్నింటినీ త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి. మైనింగ్ పొలూష్యన్ విషయంలోనూ ఫోకస్ పెట్టి చర్యలు చేపట్టాలి. రాబోయే రోజుల్లో కాలుష్యాన్ని కూడా అవేర్ లోకి తీసుకుంటాం.
మైక్రో ఇరిగేషన్‌లోనూ పంటపొలాల్లో ప్లాస్టిక్ షీట్స్ వినియోగం వల్ల దీర్ఘ కాలంలో రైతులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. దీని కోసం బయో షీట్స్ వేసేలా రైతుల్లో అవగాహన కల్పించాలి. పొల్యూషన్ కంట్రోల్, పర్యావరణ రక్షణ వంటి అంశాలపై శిక్షణ ఇవ్వాలి. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయండి’ అని సీఎం ఆదేశించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు అవసరమైన సిబ్బంది కావాలని ఆ సంస్థ ఛైర్మన్ కృష్ణయ్య ముఖ్యమంత్రిని కోరగా దీనికి సీఎం అంగీకరం తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, వైద్యారోగ్య శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read More
Next Story