
బీహార్ ఫలితాలు..ఆధిక్యంలో ఎన్డీఏ
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
బీహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. రెండు దశలుగా (నవంబర్ 6, నవంబర్ 11) జరిగిన పోలింగ్‌లో రికార్డు స్థాయి ఓటింగ్ నమోదైంది. మొత్తం 67.13 శాతం నమోదు కాగా, మహిళలు 71.6 శాతం రికార్డైంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత ఈవీఎంల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నం నాటికి స్పష్టమైన ఫలితాలు వెల్లడవుతాయి.
తాజా సమాచారం ప్రకారం నీతీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్‌డీఏ (బీజేపీ-జేడీయూ) ఆధిక్యంలో ఉంది. అందుతున్న సమచారం ప్రకారం ఎన్‌డీఏ 143 స్థానాల్లో ముందంజలో ఉంది. తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాగఠబంధన్ (ఆర్‌జేడీ-కాంగ్రెస్) 83 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీకి గణనీయమైన ప్రభావం కనిపించడం లేదు.
కీలక నేతలు: తేజస్వీ యాదవ్ (రఘోపూర్) ముందంజలో ఉన్నారు. బీజేపీ నేతలు సమ్రాట్ చౌదరి (తరాపూర్), మైథిలీ ఠాకూర్ (అలీనగర్) ఆధిక్యంలో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఎన్‌డీఏ ఆధిక్యం కనిపిస్తోంది. చాలా ఎగ్జిట్ పోల్స్ ఎన్‌డీఏకు 130-160 స్థానాలు, మహాగఠబంధన్‌కు 80-110 స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. మెజారిటీ మార్క్ 122. ప్రస్తుత ట్రెండ్ అలానే కొనసాగితే ఎన్‌డీఏ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.

