భగత్‌సింగ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి: ఏఐడీఎస్‌ఓ
సినిమా హీరోలని, క్రికెట్ స్టార్లని కాకుండా భగత్ సింగ్‌ను ఆయన పోరాట పటిమను నేటి యువత ఆదర్శంగా తీసికోవాలి.
సినిమా హీరోలని, క్రికెట్ స్టార్లని కాకుండా భగత్ సింగ్‌ను ఆయన పోరాట పటిమను నేటి యువత ఆదర్శంగా తీసికోవాలని ఏ.ఐ.డి.ఎస్.ఓ నాయకులు అన్నారు. నేడు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపనిచ్చారు.
ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్(ఏ.ఐ.డి.ఎస్.ఓ) తిరుపతి నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఎస్వీ యూనివర్సిటీ, తారక రామ స్టేడియం వద్ద అమర వీరుడు, రాజీలేని పోరాట యోధుడు భగత్ సింగ్ 117వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏ.ఐ.డి.ఎస్.ఓ నగర నాయకులు మహేష్, నవీన్ మాట్లాడుతూ బ్రిటీష్ సామ్రాజ్యవాధులకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో భగత్ సింగ్ పాత్ర చెరగనిదని అన్నారు. కేవలం 23 ఏళ్లకే చిరు నవ్వుతో ఉరికంబాన్ని ముద్దాడిన అమర వీరుడు భగత్ సింగ్ అని అన్నారు. ఈ కార్యక్రమం లో ఏఐడిఎస్‌ఓ తిరుపతి నాయకులు తేజశ్రీ, డిల్లి, భానుప్రకాష్, పరమేశ్వర్,మునిచంద్ర,సీను,విక్రమ్,తులసి కృష్ణ, ధీరజ్, వంశీ, సిఎం. కృష్ణ, తారకరామ మైదానంలోని వాకర్స్, సీనియర్ సిటిజన్స్, పిల్లలు అమర వీరుడు భగత్ సింగ్ కు ఘనంగా నివాళులు అర్పించారు.
Next Story