తిరుపతి స్విమ్స్ లో మరింత మెరుగైన వైద్యసేవలు అందిస్తామని టిటిడి చైర్మెన్ బీ ఆర్ నాయుడు తెలిపారు. టిటిడి చైర్మన్ బీఆర్. నాయుడు అధ్యక్షతన శ్రీవెంకటేశ్వర వైద్య విజ్ణాన సంస్థ (Sri Venkateswara Medical Science Institute SVIMS ) ఆస్పత్రి సమావేశ మందిరంలో బుధవారం గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. మూడు నెలలపాటు అధ్యయనం చేసిన టీటీడీ మాజీ ఈఓ ఐవి. సుబ్బారావు సారధ్యంలో నియమించిన కమిటీ నివేదిక సమర్పించిందని తెలిపారు.
ఆ నివేదికలో మౌళిక సదుపాయాలు, మానవ వనరులు, వైద్య పరికరాలు, ఇంజినీరింగ్ పనులు, మరింత ఉన్నతంగా వైద్య సేవలు అందించేందుకు వైద్య నిపుణుల సేవలు, నిధుల సేకరణ తదితర అంశాలపై నివేదిక సమర్పించిందన్నారు. ఎక్స్ ఫర్ట్ కమిటీ నివేదికపై టిటిడి బోర్డులో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. స్విమ్స్ అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇస్తున్న ఎక్స్ ఫర్ట్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఐవి. సుబ్బారావు, సభ్యులను టిటిడి చైర్మన్ కోరారు.
టిటిడి ఈఓ జె. శ్యామలరావు మాట్లాడుతూ, స్విమ్స్ చాలా ప్రతిష్టాకమైనదని, 2021లో టిటిడిలోకి స్విమ్స్ ను అప్పగించారని, స్విమ్స్ కు టిటిడి నుంచి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. సంవత్సరానికి రూ. 60 కోట్ల గ్రాంట్ తో పాటు ఎంప్లాయ్ హెల్క్ స్కీం, ప్రాణదాన ట్రస్ట్ , వివిధ రకాల ట్రస్ట్ ల ద్వారా సుమారు రూ. 100 కోట్లుకు పైగా సపోర్ట్ చేస్తున్నామని అన్నారు. స్విమ్స్ అనేది పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు స్థాపించబడిందని, సంవత్సరానికి 18,000 సర్జనీలు, దాదాపు 4. 50 లక్షలుకు పైగా ఔట్ పేసెంట్లు, 47 వేల ఇన్ పేసెంట్లు వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ఇందులో పేదలే అత్యధికంగా ఉన్నారని తెలిపారు. స్విమ్స్ లో భవిష్యత్ తరాలకు సరిపడేలా ప్లాన్ ప్రకారం నూతన భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని, అంకాలజీ , చిన్న పిల్లల హెల్త్ కోసం నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు, అంకాలజీని లెవన్ వన్ సెక్టార్ గా తీసుకెళ్లేందుకు , స్విమ్స్ లో ఫ్యాకల్టీ సమస్య, మానవ వనరులు, మౌళిక సదుపాయాల కల్పన, నిర్మాణాలు, నిధుల సమీకరణ, స్వచ్ఛంగా వచ్చే నిపుణులైన వైద్యుల సేవలు తదితర అంశాలు, సమస్యల పరిష్కారం కేసం ఎక్స్ ఫర్ట్ కమిటీ వేశారని, ఈ కమిటీ ఇచ్చిన నివేదికపై జనరల్ కౌన్సిల్ చర్చించామన్నారు.
అంతకుముందు టిటిడికి అనుబంధంగా ఉన్న స్విమ్స్ లోని అత్యాధునిక వైద్య పరికరాలతో నిర్మిస్తున్న క్యాన్సర్ భవానాన్ని టిటిడి చైర్మన్ పరిశీలించారు. 391 పడకలు ఉన్న నూతన క్యాన్సర్ ఆస్పత్రి భవనాన్ని, అందులోని 5 ఆపరేషన్ థియేటర్లను, పరికరాలను పరిశీలించారు. స్విమ్స్ కార్డియో థొరాసిక్ విభాగంలో శస్త్ర విభాగంలో చికిత్స పొందుతున్న కర్నూలు జిల్లా మంత్రాలయంకు చెందిన అన్నాభాయ్ (24 సంవత్సరాలు), ప్రకాశం జిల్లా రామాయపాలెం గ్రామానికి చెందిన బి. బన్సికా (2 సంవత్సరాలు) ఆరోగ్యం, అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నెల్లూరు జిల్లా కలిగిరి, కడప జిల్లా ఓబుళవారిపల్లి, చిత్తూరు జిల్లా పాలసముద్రం, తిరుపతి జిల్లా కాళహస్తి ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ రకాల రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.