చెవిరెడ్డిపై బాలినేని ఫైర్‌.. ఏమన్నారంటే
x

చెవిరెడ్డిపై బాలినేని ఫైర్‌.. ఏమన్నారంటే

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సవాల్‌.


విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించి వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బాలినేని ఇటీవల స్పందించారు. తాను అప్పట్లో విద్యుత్‌ శాఖ మంత్రిగా ఉన్నందున తనపై ఒత్తిడి తెచ్చి విద్యుత్‌ కొనుగోళ్లపై సంతకం చేయించాలని చూశారని, ఆ వివరాలను పూర్తిగా తెలియకుండా సంతకం చేసేది లేదని తరిస్కరించినట్లు చెప్పారు. ఈ అంశాలపై వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడటాన్ని బాలినేని తప్పుబట్టారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్‌ఆర్‌ తనకు రాజకీయ భిక్ష పెట్టారని, ఆ విషయాన్ని జనసేనలో చేరినప్పుడే చెప్పానని, వైఎస్‌ఆర్‌ మరణం తర్వాత మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి వైఎస్‌ఆర్‌ కాగ్రెస్‌ పార్టీలో చేరిన విషయాన్ని గుర్తు చేశారు. రాజశేఖరరెడ్డి కుటుంబం అంటే జగన్‌ ఒక్కరేనా? విజయమ్మ, షర్మిల కాదా? అని ప్రశ్నించారు. వారిపై అసభ్య పోస్టులు పెడితే కుటుంబంలోని వారు కానట్లు పట్టించుకోరా? అని నిలదీశారు. తాను ఎవరి మెప్పు కోసం ఏ పని చేయలేదని, ఈ విషయాలను చెవిరెడ్డి గుర్తు పెట్టుకోవాలన్నారు.

ప్రత్యర్థి పార్టీని తిట్టిన వాళ్లకే టికెట్లు ఇస్తామనే సంప్రదాయాన్ని ఎవరు కొనసాగిస్తున్నారో తెలసునని వ్యాఖ్యానించారు. ఎవరినీ విమర్శించనని చెప్పా. ఇలా చేస్తే నేను కూడా వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది. అదానితో విద్యుత్‌ ఒప్పందాలకు సంబంధించి రూ. 1750 కోట్లు లంచం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పట్లో తాను విద్యుత్‌ శాఖ మంత్రిగా ఉన్నందున ఏమీ జరిగిందో చెప్పాను. సెకీ ఒప్పందం అంశంలో నాకు ఏమాత్రం సంబంధం లేదు. సీఎండీ నుంచి ఫైల్‌ కూడా నా వద్దకు రాలేదు. చెవిరెడ్డికి ఏమి తెలుసని మాట్లాడుతున్నారు. నేను వ్యక్తిగత విమర్శలు చేస్తే ఎవరూ తట్టుకోలేరు. పవన్‌ కళ్యాణ్‌ వెంట ఉంటూ కూటమితో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. చిత్తూరు జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ అధ్యక్షుడిని తీసుకొచ్చి ఒంగోలులో టికెట్‌ ఇస్తారా? అలా చేయడం నాకు నచ్చ లేదు. అందుకే దానిని నేను అంగీకరించ లేదు. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చిందో మొత్తం చెబుతా. ధైర్యం ఉంటే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.

Read More
Next Story