రేవంత్ ఇంటి దగ్గర బ్యాగ్ కలకలం
x

రేవంత్ ఇంటి దగ్గర బ్యాగ్ కలకలం

జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఒక బ్యాగు కలకలం రేపింది. రేవంత్ ఇంటికి దగ్గరలో రోడ్డు పక్కన బ్యాగును ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు.


జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఒక బ్యాగు కలకలం రేపింది. రేవంత్ ఇంటికి దగ్గరలో రోడ్డు పక్కన బ్యాగును ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. అక్కడున్న వారిని బ్యాగు గురించి వాకాబుచేసినపుడు దాని గురించి ఎవరు చెప్పలేకపోయారు. దాంతో అప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ సెక్యూరిటి వింగ్ అధికారులు బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. బ్యాగును తనిఖీ చేయటానికి స్నిఫర్ డాగ్స్ తో పాటు బాంబు స్వ్కాడ్ నిపుణులను కూడా పిలిపించారు. ఈ బ్యాగు రేవంత్ ఇంటికి సమీపంలో ఎలా వచ్చింది ? ఎవరు తీసుకొచ్చి వదిలిపెట్టారనే విషయాన్ని ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. సీఎం ఇంటి వీధిలోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

విచిత్రం ఏమిటంటే ముఖ్యమంత్రి ఇల్లుండే వీధిని ప్రభుత్వం హై సెక్యూరిటీ జోనుగా ప్రకటించింది. 24 గంటలూ ఆ వీధిలో సెక్యూరిటి సిబ్బంది కాపలా కాస్తునే ఉంటారు. అడుగడుగునా సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. ఇవి సరిపోన్నట్లుగా రోడ్డులో అవసరమైన ప్రతిచోటా మెటల్ డిటెక్టర్లను కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ఇంత కట్టుదిట్టమైన బందోబస్తున్న రోడ్డులోకి ఆ బ్యగు ఎలాగ వచ్చిందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఆ బ్యాగులో ఏముందో ఏమో ?

Read More
Next Story