తప్పుడు ప్రచారం మానుకో.. జగన్‌కు లోకేష్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌
x

తప్పుడు ప్రచారం మానుకో.. జగన్‌కు లోకేష్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

మంత్రి నారా లోకేష్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు తీవ్ర హెచ్చరిక చేశారు.


మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంత్రి నారా లోకేష్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. తమ ప్రభుత్వంపైన తప్పుడు ప్రచారాలు చేయొద్దని, అలాంటి తప్పుడు ప్రచారాలను మానుకోవాలని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. వరద భాదిదులకు వైఎస్‌ఆర్‌సీపీ నుంచి రూ. కోటి ఇస్తామన్నారు. కానీ ఇంత వరకు రూపాయి కూడా ఇవ్వ లేదు. ఒక వాటర్‌ ప్యాకెట్, ఒక బిస్కెట్‌ ప్యాకెట్‌ కూడా పంపిణీ చేలేదని ధ్వజమెత్తారు. ఫేక్‌ జగన్‌ అని మండి పడ్డారు. వరద బాధితులకు సాయం చేయక పోగా, ప్రభుత్వం చేపట్టిన వరద సహాయక చర్యలపై విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు.

వరద ప్రాంతాల్లో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ. 23 కోట్లా అంటూ ఫేక్‌ ప్రచారం చేస్తున్నారని, వీటికి ఖర్చు రూ. 23 లక్షలు కూడా కాలేదన్నారు. జగన్‌ పాలనలో మాదిరిగా వెలువడిన చీకటి జీవోలు, చీకటి లెక్కలు కాదు కూటమి ప్రభుత్వానివి అని విమర్శించారు. తమ ప్రభుత్వం లెక్కలన్నీ పారదర్శకంగా ఉంటాయని, వీటికి సంబంధించిన వివరాలను ఎక్స్‌లో పోస్టు పెట్టామని, చదవు వస్తే చదువుకో, కళ్లుంటే చూడు అని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలస్‌లో దాక్కుని ఎప్‌ పఫల పేరుతో కోట్లు మెక్కారని జగన్‌ను విమర్శించారు. ఫేక్‌ జగన్‌ ఇకనైనా నీ ఫేక్‌ ప్రచారాలు ఆపు అని జగన్‌ను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఎక్స్‌ వేదికగా లోకేష్‌ పోస్టు పెట్టారు.



Read More
Next Story