ముద్రగడ ఇంటిపై దాడి..జై జనసేన అంటూ నినాదాలు
ట్రాక్టర్‌తో ముద్రగడ కారును ధ్వంసం చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన సంచలనంగా మారింది.
మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాపు నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటి మీద ఓ జనసేన కార్యకర్త దాడికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి ట్రాక్టర్‌ను నడుపుకుంటూ ముద్రగడ ఇంటి గేటును ఢీకొట్టి ట్రాక్టర్‌తో తోసుకుంటూ ఇంటి ఆవరణలోకి వెళ్లాడు. ఇంటి ఆవరణలో ర్యాంపు మీద పార్క్ చేసిన ఉన్న ముద్రగడ కారును ట్రాక్టర్‌తో వెనుక నుంచి ఢీ కొట్టి ధ్వంసానికి పాల్పడ్డాడు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఆదివారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ తతంగాన్ని గమనిచించిన చుట్టు పక్కల వాళ్లు, ముద్రగడ ఇంట్లోని పని వాళ్లు వచ్చే సరికి ట్రాక్టర్‌ను అక్కడే వదిలేసి జై జనసేన అంటూ నినాదాలు చేసుకుంటూ వెళ్లి పోయాడు.
ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. జగపతి నగరంకు చెందిన గంగాధర్‌గా పోలీసులు గుర్తించారు. ఇతను జనసేనకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడు గంగాధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరో వైపు ముద్రగడ ఇంటిపై జరిగిన ఈ దాడి ఘటన కాకినాడ జిల్లాలో సంచలనగా మారింది. ఒక్క సారిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ శ్రేణులు ఈ ఘటనతో ఉలక్కిపడ్డారు. ఘటన గురించి తెలుసుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ముద్రగడ అభిమానులు పెద్ద ఎత్తున కిర్లంపూడికి చేరుకుంటున్నారు. కాకినాడ వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ముద్రగడ ఇంటికి చేరుకుంటున్నారు. దీంతో ఈ రోజు కాకినాడ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఘటన సంచలనంగా మారింది. దీని పరిణామాలు ఎలా ఉంటాయో అని పోలీసులు ఆందోళనలు చెందుతున్నారు.
Next Story