నాదెండ్ల దూకుడు: రేషన్ అక్రమాలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మనోహర్
x

నాదెండ్ల దూకుడు: రేషన్ అక్రమాలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మనోహర్

సివిల్‌ సప్లైస్‌ డిపార్టుమెంట్‌లో దారుణం జరుగుతోందా? కోట్లకు కోట్లు దుర్వినియోం అవుతున్నాయా? తూకాల్లో మోసాలు జరుగుతున్నాయా?


పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాదెండ్ల మనోహర్ దూకుడు మీద ఉన్నారు. ఇలా బాధ్యతలు తీసుకోగానే అలా పని మొదలుపెట్టటమే కాకుండా ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని బయటపెట్టటంతో రాష్ట్రమంతా విస్తుపోయింది. మనోహర్ తెనాలి నియోజకవర్గంలోని పలు గోడౌన్‌లు స్వయంగా తనిఖీ చేశారు. మంగళగిరి నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ గోడౌన్‌లలో అధికారుల ద్వారా చెక్‌ చేయించారు. ఇందులో చాలా లోపాలు ఉన్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్‌ గుర్తించారు. ఈ క్షణం నుంచి నిత్యవసర వస్తువులు పంపిణీని ఆపివేయాలని ఆదేశించారు.

చౌక ధరల దుకాణాల ద్వారా వివిధ ర కాల నిత్యావసర వస్తువులతో పాటు రైస్‌ కూడా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. బియ్యం నాణ్యత లేవు. పురుగులు పట్టిన బియ్యాన్ని స్వయంగా మంత్రి నాదెండ్ల పరిశీలించారు. అలాగే చెక్కెర, కందిపప్పు, పామాయిల్‌ తదితర పాకెట్ల బరువును తూకం వేయించారు. ప్రతి పాకెట్లోనూ 50 నుంచి 100 గ్రాముల వరకు తూకంలో తేడాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1.48 కోట్ల మందికి నిత్యావసర వస్తులు ప్రతి నెలా పంపిణీ జరుగుతున్నాయి. ఈ విషయంలో వినియోగ దారులు దారుణంగా మోస పోతున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్‌ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో కాక పుట్టిస్తున్నాయి.
మొదటి సారిగా ఆహాఆర, పౌరసరఫరాల శాఖలు ఎలా పనిచే స్తున్నాయో తెలుసుకునేందుకు క్షత్రస్థాయి పరిశీలన చేస్తే బాగుంటుందని భావించారు. తెనాలి వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని గోదాములలో ఉంచిన బియ్యం నిల్వలను మంత్రి మనోహర్‌ పరిశీలించారు. అక్కడి బియ్యం బస్తాలకు పురుగుపట్టి ఉండటంపై మంత్రి స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడౌన్‌లో స్టాక్‌ వివరాల డేటా సరిగా లేకపోవడాన్ని పరిశీలించారు. సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేను మరళా తిరిగి వచ్చేలోపు అన్నీ సవరించుకోవాలని సూచించారు.
అనంతరం పినపాడులోకి ఎంఎల్‌ఎస్‌ గోడౌన్‌ పాయింట్‌ నుంచి ఎన్ని నిత్యావసర వస్తువులు రిలీజ్‌ అవుతున్నాయి. పరిస్థితి ఏమిటనే దానిపై విచారణ జరిపించారు. దీంతో ప్రతి పాకెట్‌లోనూ 50 నుంచి వంద గ్రాములు తక్కువ తూకం ఉంది. దీనిని పరిశీలించిన మనోహర్‌ మంగళగిరి నియోజకవర్గంలో కూడా తనిఖీ చేయాలని ఉన్నతాధికారులను ఆశించారు. దీంతో అధికారులు పలు గోడౌన్‌లు ఎంఎల్‌ఎస్‌ (మండల్‌ లెవెల్‌ సర్వీస్‌ పాయింట్స్‌) పాయింట్ల వద్ద తనిఖీ చేశారు. అన్ని చోట్లో గోల్‌మాల్‌ జరుగుతోంది. ప్రతి ఇంటికీ నేరుగా నిత్యావసరాలు సప్లై చేస్తున్నామని చెప్పిన గత ప్రభుత్వం దారుణంగా వ్యవహరించింది. నాణ్యతా ప్రమాణాలు అలా ఉంచితే తూకంలో కూడా మోసం జరుగుతోందని, దీనిని విచారించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి నాదెండ్ల మీడియాకు వెల్లడించారు. అంటే పేద ప్రజలకు అందిస్తున్న బియ్యం పురుగు పట్టాయని, వివిధ రకాల పాకెట్లు 50 నుంచి 100 గ్రాముల తక్కువ తూకంతో ఉందనడాన్ని చూసినందున ఈ కమిటీ వెంటనే రిపోర్టు తయారు చేసి అందించాలని ఆదేశించారు.
నిత్యావసరాల్లో దోపిడీపై విచారణ
ఇప్పటి వరకు నిత్యావసరాల్లో దోపిడీకి పాల్పడుతున్న కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు నేరుగా ప్యాకెట్లు తూకం వేసి వినియోగదారులకు ఇవ్వలేదు. తన పరిణతిని ఉపయోగించి తీసుకున్న నిర్ణయాలు వల్ల చర్యలకు ఆస్కారం లబించింది.
వారం పాటు సరుకుల పంపిణీ ఉండదు..
వారం రోజుల పాటు ఏపీలో నిత్యవసర వస్తువుల పంపిణీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలను బయటకు తీసుకు రావాలంటే ఇటువంటి చర్యలు తీసుకోవడం మంచిదని అధికారులు భావిస్తున్నారు. అందుకే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. విచారణ సందర్భంగా వారం రోజుల పాటు లోకల్‌ ఆడిట్‌ నిర్వహించి, ఏ వస్తువు ఎంత తక్కువ తూకం ఉంది. నాణ్యతలో ఎందుకు మోసం జరుగుతోంది. అనే వివరాలు తయారు చేసి అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని మంత్రి నాదెండ్ల ప్రకటించారు.
Read More
Next Story