
గోవా గవర్నర్‌గా కొలువుదీరిన అశోక్ గజపతిరాజు
మంత్రి నారా లోకేష్‌తో పాటు మరి కొందరు టీడీపీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా శనివారం బాధ్యతలు చేపట్టారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే అశోక్ గజపతి రాజు చేత గోవా గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. గోవ ప్రభుత్వం ఆధ్వర్యంలో
శనివారం ఉదయం గోవాలోని గోవా రాజ్‌భవన్ బంగ్లా దర్బార్ హాల్‌లో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌తో పాటు ఆ రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. టీడీపీ సీనియర్ నాయకులు కేంద్ర మంత్రి రామ్మోహన్‌రాయుడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, పలువురు టీడీïపీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై.. అశోక్ గజపతిరాజుకు అభినందనలు తెలిపారు.
Next Story