నిరసనలు తెలిపితే సంకరజాతి అంటారా
x

నిరసనలు తెలిపితే సంకరజాతి అంటారా

మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదని మంత్రి నారా లోకేష్‌ హెచ్చరించారు.


కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన అమరావతి మహిళలు వైసీపీ వాళ్లకు సంకరజాతిగా కనిపిస్తున్నారా? అంటూ మంత్రి నారా లోకేష్‌ మండిపడ్డారు. మహిళలను కించపరిస్తే బరాబర్‌ చర్యలు తీసుకుంటామని మరో సారి స్పష్టం చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును ఖండిస్తూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై లోకేష్‌ మండిపడ్డారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. దీనికి సజ్జల వ్యాఖ్యల వీడియోను షేర్‌ చేశారు.

లోకేష్‌ ఏమన్నారంటే..
తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తే, వైసీపీ నాయకులకు సంకరజాతి వారుగా కనిపిస్తున్నారా? ఏమిటీ ఈ భాష? ఏమిటీ విపరీత ప్రవర్తన? తలపండిన సాక్షి జర్నలిస్టులు మహిళలను వేశ్యలు అంటూ అవమానించారు. ఇప్పుడు వైసిపి నేతలు మహిళల్ని కించపరుస్తూ
సంకరజాతి అంటూ దిగజారి మాట్లాడతారు. మహిళలు అంటే ఎందుకు ఇంత చిన్నచూపు! జగన్‌ రెడ్డి గారు తల్లి, చెల్లిని తరిమేసిన అమానవీయ ప్రవర్తనను వైసీపీ నేతలు ఆదర్శంగా తీసుకున్నట్టు ఉన్నారు. మహిళల జోలికి వస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాం. అంటూ ఎక్స్‌ వేదికగా వైసీపీ నాయకులను హెచ్చరించారు.

Read More
Next Story