ఏఆర్ రెహమాన్ కుటుంబానికి ఎంత కష్టం వచ్చిందో..
పెళ్లై 30 ఏళ్లు పూర్తి చేసుకునే దశలో విడిపోవడం బాధాకరమని రెహమాన్ అన్నారు. బావోద్వేగపూరిత ఒత్తిడి కారణంగా విడిపోవలసి వచ్చిందని సైరాబాను లాయర్ చెప్పారు.
తమిళ నాటే కాదు భారత సంగీత ప్రపంచానికి రారాజుగా వెలుగొందుతున్న ప్రముఖ సంగీత దర్శకులు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ దంపతులు విడాకులు తీసుకోవడం సంచలనంగా మారింది. చలన చిత్ర పరిశ్రమలో చూడ ముచ్చట కపుల్గా గా పేరు తెచ్చుకున్న రెహమాన్, సైరా బాను జంట విడిపోవడం సంగీత ప్రియులు జీర్ణించుకోలేక పోతున్నారు. కష్టాల్లోను, కన్నీళ్లోను, సంతోషాల్లోను అన్నేళ్లు అన్యోన్యంగా జీవించిన జంటగా పేరు తెచ్చుకున్న రెహమాన్ దంపతులు, వారి అభిమానుల్లో తీరని బాధను మిగిల్చారు.
భారత దేశ సంగీతం గొప్పతనాన్ని ఆస్కార్ గడ్డ మీద రెపరెపలాడించిన రెహమాన్ ఎదిగిన చెట్టు ఒదగమనే రీతిలోనే అందరి మన్ననలను పొందిన వ్యక్తిగా రెహమాన్‌కు పేరుంది. తన తల్లిని, సోదరిని ఎంతగా ప్రేమిస్తారో అంతకంటే మిన్నగా తన అర్థాంగి సైరా బానును ఆరాధిస్తారు. తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తారు. సంగీతం సమకూర్చడంలో క్షణం తీరిక లేకకుండా ఉన్నా.. తన భార్య కోసం, తన పిల్లల కోసం తన విలువైన సమయాన్ని వెచ్చించడంలో ఏ నాడూ తప్పు చేయలేదు. 1995లో రెహమాన్ పెళ్లిని పెద్దలు కుదిర్చారు. సైరాబానుతో పెళ్లి చేయాలని నిర్ణయించారు. మరి కొద్ది రోజులు గడిస్తే వారి కుటుంబ జీవితానికి 30 ఏళ్లు నిండుతాయి.
29 ఏళ్లు కలిసి మెలిసి జీవించిన రెహమాన్, సైరాబాను దంపతులకు ముగ్గురు పిల్లలు. వారి పేర్లు రహీమా, ఖతీజా, అమీన్. రెహమాన్ దంపతులు విడిపోతున్నట్లు ఆయన సతీమణి తరపున న్యాయవాది వందనా షా ప్రకటించారు. భర్త ఏఆర్ రెహమాన్ నుంచి సైరాబాను విడిపోవాలనుకున్నారు. వారి వైవాహిక బంధానికి తగిలిన భావోద్వే గాయం వల్ల వారు ఈ నిర్ణయానికి వచ్చారు. ఒకరిపై ఒకరికి గాఢమైన ప్రేమ ఉంది. అయినప్పటికీ వారి ఇరువురి మధ్య తలెత్తిన ఉద్రిక్తత పూర్వక, ఇబ్బందికర పరిస్థితులను అధికమించలేని గ్యాప్‌ను అవి సృష్టించాయి. ఈ విషయాలను రెహమాన్, సైరాబానులు గుర్తించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరువురూ కలిసి జీవించలేమని భావించారు. ఎంతో బాధ, ఆవేదనల మధ్య సైరా బాను విడాకులు తీసుకున్నారు. పర్సనల్ లైఫ్‌లో అత్యంత సంక్లిష్టమైన దశలో ఈ నిర్ణయం తీసుకోవడాన్ని అభిమానులు, ప్రజలు అర్థం చేసుకోవాలని, తమకు వ్యక్తిగత గోప్యతకు విలువనివ్వాలని సైరా బాను అభ్యర్థించినట్లు ఆమె తరపున లాయర్ వందనాషా చెప్పడం గమనార్హం.
1995లో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న రెహమాన్ దంపతులకు మరో కొద్ది రోజులైతే 30 వసంతాలు పూర్తి అవుతాయి. ఈ నేపథ్యంలో తన విడాకులపై రెహమాన్ స్పందించిన తీరు అభిమానుల్లో కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. తమ వివాహ బంధం త్వరలో 30 వసంతాలు పూర్తి చేసుకుంటుందని భావించామని, కానీ వూహించని రీతిలో తమ వైవాహిక జీవితానికి ముగగింపు పలకాల్సి వస్తుందని అనుకోలేదని స్పందించారు. పగిలిన హృదయాలను దైవాన్ని కూడా ప్రభావితం చేస్తాయని, తిరిగి యధాతధంగా అతుక్కోలేవని వివాహ బంధం గురించి రెహమాన్ చెప్పిన మాటలు అభిమానుల హృదయాలను చెమర్చాయి. కొన్ని కఠిన పరిస్థితుల్లో తమ వ్యక్తిత గోప్యతను అర్థం చేసుకుంటారని తమ అభిమానులు, ప్రజలు భావిస్తారని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. రెహమాన్, సైరాబానులు విడిపోవడంపై వారి పిల్లలు స్పందించారు. మా తల్లిదండ్రులు విడాకుల విషయంలో గోప్యత పాటిస్తూ .. గౌరవంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
Next Story