ఆంధ్రాలో మరో 11 కార్పొరేషన్లకు చైర్మన్లు
x

ఆంధ్రాలో మరో 11 కార్పొరేషన్లకు చైర్మన్లు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 11 కార్పొరేషన్లు, బోర్డులు, సొసైటీలకు చైర్మన్లను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలకు చెందిన నాయకులను చైర్మన్ల పోస్టుల్లో నియమించారు. పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా కిందిస్థాయి నాయకులకు ప్రోత్సాహంగా ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ చైర్మన్లు సంబంధిత సంస్థల్లో వెల్ఫేర్, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు.

పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా కల్యాణం శివశ్రీనివాసరావును, ఏపీ స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఛైల్డ్ లేబర్‌కు సత్యనారాయణ రాజును, ఏపీ అధికార భాష సంఘానికి(అఫిషియల్ లాంగ్వేజ్ కమిషన్‌) విక్రమ్‌ను నియమించారు. ఉర్దూ అకాడమీకు మౌలానా షిబిలీ, ఫిషర్‌మెన్ కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్‌కు రామ్‌ప్రసాద్, పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకు మధుబాబును చైర్మన్‌లుగా నియమించారు. స్టేట్ రెడ్డిక వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీకు శంకర్‌రెడ్డి, కుర్ని, కరికాలభక్తుల వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు మిన్నప్ప, స్టేట్ షేక్, షీక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీకు ముక్తియార్, భట్రాజ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు వెంకటేశ్వరరాజు, పెరిక వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీకు వీరభద్రరావును నియమించారు.

Read More
Next Story