
ఏపీ ఇకపై చరిత్ర సృష్టించే డిజిటల్ హబ్
గూగుల్ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఏడాదిన్నరగా చేసిన శ్రమ ఫలించిందని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు.
నానా లోకేశ్ తన ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్‌లో విశాఖపట్నంలో గూగుల్ సంస్థ డేటా సెంటర్ పెట్టేందుకు చేసుకున్న ఒప్పందాన్ని "ఏపీకి చారిత్రక రోజు"గా పేర్కొన్నారు. "అక్టోబర్ 2024లో గూగుల్ హెడ్‌క్వార్టర్స్ సందర్శనతో మొదలైన విజన్... ఒక సంవత్సరం తీవ్ర చర్చలు, అవిశ్రాంత కృషి తర్వాత చరిత్ర సృష్టిస్తున్నాం. గూగుల్ ఏపీ ప్రభుత్వంతో 1 గిగావాట్ ప్రాజెక్టుకు $10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఎమ్ఓయూ సంతకం చేసింది. ఇది రాష్ట్ర డిజిటల్ ఫ్యూచర్, ఇన్నోవేషన్, గ్లోబల్ స్టాండింగ్‌కు భారీ లీప్. ఇది కేవలం మొదలు మాత్రమే" అని పేర్కొన్నారు.
గూగుల్‌తో జరిగిన ఒప్పందం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును రాష్ట్రానికి చారిత్రక మైలురాయిగా అభివర్ణించారు. దిల్లీలో ఒప్పందం సంతకాల సమయంలో, సోషల్ మీడియాలో ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి.
ఈ ప్రాజెక్టు డిజిటల్ ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది, గ్లోబల్ టెక్ మ్యాప్‌పై ఏపీని మరింత బలంగా నిలబెట్టే మైలురాయిగా మారుతుందని అన్నారు. విశాఖలో గూగుల్ అడుగుపెట్టడం సంతోషదాయకమని, రాష్ట్రంలో పెట్టుబడులకు కొదవ లేదని చెప్పారు. విజనరీ నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో మరిన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయని తెలిపారు.
కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు, నారా లోకేష్
పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు
ఈ $10 బిలియన్ (సుమారు రూ. 83,000 కోట్లు) పెట్టుబడి ఏపీకి భారతదేశంలోనే అతిపెద్ద ఎఫ్‌డీఐ అని నారా లోకేశ్ అన్నారు. "డేటా అనేది కొత్త ఆయిల్. ఇలాంటి ఇనిషియేటివ్‌లు భారత్‌కు వ్యూహాత్మక అడ్వాంటేజ్ అందిస్తాయి" అని పేర్కొన్నారు. 1 గిగావాట్ సామర్థ్యం 2 లక్షల డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్ ఉద్యోగాలు సృష్టిస్తుందని, మొదటి దశ మూడేళ్లలో అమలు చేస్తామని చెప్పారు. సిఫీతో 500 మెగావాట్ ఒప్పందం ఇప్పటికే జరిగింది, మరో నాలుగు కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. మూడేళ్లలో మొత్తం 6 గిగావాట్ సామర్థ్యం లక్ష్యమని అన్నారు. ఏపీని $2.4 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడానికి ఈ ప్రాజెక్టు కీలకమని పేర్కొన్నారు.
ప్రభుత్వ సహకారం, పాలసీ మార్పులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 'డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్' సహకారం వల్లే ఈ ఒప్పందం సాధ్యమైందని లోకేశ్ అన్నారు. "మా మొదటి మీటింగ్ 2024 సెప్టెంబర్‌లో జరిగింది. నేను వారిని లంచ్‌కు ఆహ్వానించి, సైట్ చూపించాను. తర్వాత హెడ్‌క్వార్టర్స్ సందర్శించి చర్చలు కొనసాగించాను" అని చెప్పారు. టాక్స్ సర్టెన్టీ, రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ లేకుండా చేయడం, డేటా ఎంబసీలు, పర్మనెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ నిర్వచనం వంటి సెంట్రల్ పాలసీ మార్పులు కీలకమని తెలిపారు. "ఇవి ఏపీ మాత్రమే కాదు, దేశానికి మేలు చేసే అంశాలు" అని అన్నారు. లాఫుల్ ఇంటర్‌సెప్షన్, కాపీరైట్ ఇష్యూలు కూడా పరిష్కరించామని చెప్పారు.
ఎంవోయూ సందర్బంగా జరిగిన మీట్
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సస్టైనబిలిటీ
పవర్, వాటర్ గజ్లర్‌లుగా డేటా సెంటర్లను విమర్శించడాన్ని తోసిపుచ్చిన లోకేశ్, "ఏఐ ఇక్కడే ఉంది. దాన్ని స్వీకరించాలి లేదా రీప్లేస్ అవ్వాలి. మేం స్వీకరించాలని నిర్ణయించాం" అని అన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ (సోలార్, విండ్, పంప్ స్టోరేజ్, బ్యాటరీ), థర్మల్ మిక్స్‌తో పవర్ ధరలు 13 శాతం తగ్గించామని, డేటా సెంటర్లకు సెపరేట్ గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. "పవర్ ధరలు పెరగవు. గూగుల్ గ్రిడ్‌లో పెట్టుబడి పెడుతుంది. రాష్ట్రం సబ్సిడీ ఇస్తుంది" అని తెలిపారు. వాటర్‌కు గోదావరి ఇంటర్‌లింకింగ్ ప్రాజెక్టు చేపడుతున్నామని అన్నారు. విశాఖను ఏపీ ఎకనామిక్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతామని, గ్రేటర్ విశాఖ ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. "హైదరాబాద్ 30 ఏళ్లలో సాధించింది మేము 10 ఏళ్లలో సాధిస్తాం" అని అన్నారు.
ఈ ఒప్పందం ఏపీని డిజిటల్ హబ్‌గా మారుస్తుందని, విద్య, స్కిల్ డెవలప్‌మెంట్, గవర్నెన్స్‌లో పరివర్తన తెస్తుందని లోకేశ్ హైలైట్ చేశారు.