రేపూ కొనసాగనున్న వర్షాలు..
x

రేపూ కొనసాగనున్న వర్షాలు..

మధ్య మహారాష్ట్ర, తమిళనాడు మధ్య ఏర్పడిన ద్రోణి కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. అయితే ఆంధ్రలో ఈ వర్షాలు రేపు కూడా కొనసాగుతాయని


మధ్య మహారాష్ట్ర, తమిళనాడు మధ్య ఏర్పడిన ద్రోణి కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. అయితే ఆంధ్రలో ఈ వర్షాలు రేపు కూడా కొనసాగుతాయని రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడా తేలికపాటి వర్షాలు కురవొచ్చని ఆయన వివరించారు. అదే విధంగా రాయలసీమలో కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

ఇదిలా ఉంటే మరోవైపు శ్రీకాకుళంలో 8 మండలాలు, విజయనగరంలో 6, మన్యంలో 12, అల్లూరి జిల్లాలో 2 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఇటువంటి పరిస్థితే రాష్ట్రంలో మరికొన్ని రోజులు కొనసాగొచ్చని అంచనా వేశారు. ఎల్లుండి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తెలిపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

Read More
Next Story