
జర్మనీలో మరణించిన ఏపీ విద్యార్థిని..తల్లడిల్లిన తల్లిదండ్రులు
ఉన్నత చదువులకెళ్లి జర్మనీకి వెళ్లింది. అక్కడ క్యాన్సర్ మహమ్మారి బారిన పడి మరణించింది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థిని విదేశాలలో ఉన్నత చదువులు చదవాలని ఆశించింది. జర్మనీ దేశమైతే అనుకూలంగా ఉంటుందని భావించింది. 2022లో అక్కడకు వెళ్లింది. ప్రస్తుతం ఆల్ అనే పట్టనంలో ఆమె ఉన్నత చదువులు అభ్యసిస్తోంది. కానీ దురదృష్టం ఆమెను వెంటాడింది. భయంకరమైన బ్లడ్ క్యాన్సర్ ఆమె భవిష్యత్‌ను నాశనం చేసింది. ఆరోగ్యం విషమించడంతో విదేశాలలో ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాలనే ఆశతో పాటు తన కుటుంబానికి బాసటగా నిలవాలనే కోరికలు నెరవేరకుండానే గత సోమవారం ఆమె మరణించింది. విషయం తెలుసుకున్న ఆ కుటుంబం తల్లడిల్లి పోయింది. దీర్ఘాయుష్షుతో జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోకుండానే చిన్న వయస్సులోనే మృత్యువాత పడటంతో ఆమె తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగి పోయారు. గుండెలు బాదుకుంటూ విలిపించారు. స్థానికులను సైతం కన్నీరుమున్నీరయ్యారు.
షేక్ మహబూబ్ బాషా ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కంచిపల్లె గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో రెహనాబేగం పెద్ద కుమార్తె. జర్మనీ దేశంలో ఉన్నత చదువులు చదవాలని ఆశపడింది. బయోమెడికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ కోర్సు చేయాలని భావించింది. అందుకు రిటైర్డ్ టీచర్ అయిన తన తండ్రి మహబూబ్ బాషా అడ్డు చెప్పలేదు. కుమార్తె రెహనాబేగం భుజం తట్టి ప్రోత్సహించాడు. ఖర్చులు భరిస్తాను, వెళ్లి చదువుకో అని ఎంకరేజ్ చేశాడు. దీని కోసం 2022లో జర్మనీకి వెళ్లింది. హాల్ అనే పట్టణంలో తాను అనుకున్న కోర్సును ఇటీవలె పూర్తి చేసింది. దీని ఆధారంగా జీవితంలో స్థిరపడాలని భావించింది. ఇంతలోనే క్యాన్సర్ మహమ్మారి రెహనాబేగం ఆరోగ్యాన్ని చిన్నాబిన్నం చేసింది. బ్లడ్ క్యాన్సర్ వల్ల రెహనాబేగం ఆరోగ్యం క్షీణించడంతో ఈ నెల 21న మరణించింది. అయితే ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జర్మనీలో మరణించిన రెహనాబేగం మృతదేహం ఆదివారం రాత్రి హైదరబాద్‌కు చేరుకుంది. అక్కడ నుంచి సోమవారం ఉదయం స్వగ్రామమైన గిద్దలూరు మండలం కంచిపల్లె గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Next Story