పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్.. మళ్ళీ బాలకలదే పైచేయి
x

పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్.. మళ్ళీ బాలకలదే పైచేయి

ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. వీటిలో బాలికలే పైచేయి సాధించారు.


ఆంధ్రప్రదేశ్‌లో 2023-2024 విద్యాసంవత్సరం పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఈరోజు ఉదయం విజయవాడలో విడదుల చేశారు. ఈ ఏడాది మొత్తం 6 లక్షల 23 వేల 92 మంది పదోతరగతి పరీక్షలు రాయగా వారిలో 1 లక్ష 2 వేల 528 మంది గతేడాది ఫెయిల్ కావడంతో ఈ ఏడాది రాసిన వారు ఉన్నారు. ఈ ఏడాది పరీక్షలు రాసిన వారిలో 86.69 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది ఇంటర్ మీడియట్ పరీక్షల్లో పైచేయి సాధించిన బాలికలు.. పదోతరగతి పరీక్షల్లో తమ సత్తా చాటారు. పదో తరగతి ఫలితాల్లో కూడా అత్యధిక ఉత్తీర్ణ బాలికల సొంతమైంది. ఫలితాల కోసం https://results.bse.ap.gov.in/ ను వీక్షించండి.


ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు 3743 కేంద్రాల్లో జరగగా 6.16 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 5,34,574 మంది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2803 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 17 పాఠశాలల్లో సున్నా ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాల్లో మన్యం జిల్లా అగ్రస్థానంలో నిలవగా 62.47 శాతం ఉత్తీర్ణతతో కర్నూలు ఆఖరి స్థానంలో నిలిచాయి.

Read More
Next Story