
ఏపీ సిమ్‌లు..కాంబోడియా నుంచి ఫోన్లు
అంతర్జాతీయ నేర నెట్‌వర్క్‌ను చాకచక్యం చేదించి 1400సిమ్‌కార్డులను సీజ్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు.
ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు మరో సారి తమ ప్రతిభను కనబరిచారు. అంతుచిక్కకుండా భారీ నేరాలకు పాల్పడుతున్న ఓ భారీ అంతర్జాతీయ సైబర్ నేరాల నెట్‌వర్క్‌ను చాకచక్యంగా ఛేదించారు. ఆఫ్రికా దేశమైన కంబోడియా కేంద్రంగా సాగుతున్న ఈ ముఠా సైబర్ నేర కార్యకలాపాలను పసిగట్టిన ఏపీ సీఐడి అధికారులు, పక్కా సాంకేతిక ఆధారాలతో ఆ ముఠాకు చెందిన నిందితులను పట్టుకున్నారు.
ప్రధాన నిందితుడి అరెస్ట్
కరుడు గట్టిన ఈ ముఠాకు సంబంధించిన ఓ కీలక సూత్రధారిగా భావిస్తున్న హో హుడే అనే విదేశీ నిందితుడిని పశ్చిమ బెంగాల్‌లో ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ (DoT) సహకారంతో జరిపిన ఈ ఆపరేషన్‌లో ఈ భారీ సైబర్ క్రైమ్ నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చింది.
నేరానికి పాల్పడే తీరు
కంబోడియా కేంద్రంగా: నిందితులు కంబోడియాలో ఎవరికీ అనుమానాలు రాకుండా అత్యాధునిక కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
సిమ్ బాక్స్ కేంద్రాలు: విశాఖపట్నం, పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి ప్రాంతాల్లో రహస్యంగా 'సిమ్ బాక్స్' కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటిని కంబోడియా కాల్ సెంటర్లకు అనుసంధానించారు.
మ్యూల్ సిమ్ కార్డులు: అమాయకుల ధ్రువపత్రాలను సేకరించి, వాటి ద్వారా భారీగా మ్యూల్ సిమ్ కార్డులను తీసుకున్నారు.
సాంకేతిక మోసం: ఈ నెట్‌వర్క్ ద్వారా కాల్స్ చేస్తూ, అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా సర్వర్లను ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.
భారీగా స్వాధీనం
నిందితుల నుంచి సైబర్ నేరాలకు వినియోగిస్తున్న సుమారు 1400 సిమ్ కార్డులను, పలు ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపైన ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన ఏపీ సీఐడీ పోలీసులు సర్వర్లు, సిమ్ కార్డులు ఎక్కడి నుంచి పనిచేస్తున్నాయనే అంశంపై లోతైన విచారణ జరుపుతున్నారు. ఈ నెట్‌వర్క్‌కు సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించేందుకు సీఐడీ అధికారులు త్వరలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఏపీలో పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో ఈ అరెస్ట్ ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు.
Next Story

