ఆంధ్ర ఎన్నికల ప్రచార షెడ్యూల్స్ ఇవే..
x

ఆంధ్ర ఎన్నికల ప్రచార షెడ్యూల్స్ ఇవే..

ఆంధ్రలో అన్ని పార్టీల అధినేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాగా ఈరోజు ఎవరి షెడ్యూల్ ఎలా ఉందంటే..


ఆంధ్ర ఎన్నికల్లో ప్రస్తుతం ప్రచార ఘట్టం కొనసాగుతోంది. ప్రధాన పార్టీ అధినేతలు, అభ్యర్థులు అందరూ తీవ్రస్థాయిలో ప్రచారాలను కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమదైన స్టైల్‌లో ప్రచార హోరెత్తిస్తున్నారు. మేమంతా సిద్ధం అంటూ జగన్, వారాహి విజయ యాత్ర పేరిట పవన్, ప్రజాగళం పేరుతో చంద్రబాబు దూసుకుపోతున్నారు. వీరికి తానేమీ తీసుపోనన్నట్లు మరోవైపు వైఎస్ షర్మిల కూడా బస్సు యాత్ర చేపట్టారు. ఎన్నికల్లో అందరూ గెలుపే లక్ష్యం అంటుంటే షర్మిల మాత్రం జగన్ ఓటమే ఆశయం అంటున్నారు. అయితే వారి షెడ్యూల్ ఈరోజు ఎలా ఉందంటే..

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ యాత్ర నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలోని చింతారెడ్డి పాలెం నుంచి ప్రారంభమై 11 గంటలకు నెట్టూరు సిటీ నియోజకవర్గం టెడో, కాంప్లెక్స్, వెంటేశ్వరపురంకు చేరుకుని అక్కడ ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం నిర్వహిస్తారు. అక్కడి నుంచి 12 గంటలకు కోవూరు ఎంట్రన్స్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి పలు నియోజవర్గాల్లో ప్రజలతో మమేకమవుతూ సాయంత్రం 4:30 నిమిషాలకు కావలి నియోజకవర్గంలోని కావలి బైపాస్ రోడ్‌లో మహేంద్ర లేఅవుడ్ దగ్గర జిల్లా సిద్ధం సభ నిర్వహిస్తారు. రాత్రి ఏడు గంటలకు కొండపి నియోజకవర్గం జువ్విగుంట ఎక్స్ రోడ్ దగ్గర క్యాంప్ నిర్వహిస్తారు.


ఎన్ చంద్రబాబు నాయుడు.. ‘ప్రజాగళం’ యాత్రలో భాగంగా ఈరోజు పెదకూరపాడు, సత్తెనపల్లిలో పర్యటించనున్నారు. క్రోసూరు, సత్తెనపల్లిలో సాయంత్రం బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

అయితే పవన్ కల్యాణ్.. ఏప్రిల్ 7 ఆదివారం నుంచి ఉత్తరాంధ్రలో ‘వారాహి విజయభేరి యాత్ర’ను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర అనకాపల్లి నుంచి ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే ఈ యాత్ర ప్రారంభం కావాల్సి ఉండటా పవన్‌కు అస్వస్థత రావడంతో ఆలస్యమైంది.

కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా జోరుగా బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. ఏప్రిల్ 5న కాశీనాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బీ కోడూరు, గోపవరంలో యాత్ర కొనసాగింది. దానికి కొనసాగింపుగానే ఈరోజు బద్వేల్, అట్లూరు, కడపలో షర్మిల బస్సు యాత్ర సాగనుంది. ఈ నియోజకవర్గాల్లో కూడా షర్మిల సభ నిర్వహించనున్నట్లు సమాచారం.


Read More
Next Story