అంతరిక్షంలోకి తెలుగు కుర్రాడు..
x

అంతరిక్షంలోకి తెలుగు కుర్రాడు..

అంతరిక్షంలోకి మొదటిసారి ఓ తెలుగు వ్యక్తి గోపీచంద్ తోటకూరి. బ్లూఆరిజిన్ సంస్థ చేపట్టనున్న ఎన్‌ఎస్-25 మిషన్‌లో భాగంగానే గోపీచంద్.. అంతరిక్ష ప్రయాణం చేయనున్నారు.


అంతరిక్షయానం చేయాలన్న కలను నెరవేర్చుకోవడానికి ప్రతి ఏడాది వేలాది మంది ఔత్సాహికులు ప్రయత్నిస్తుంటారు. కానీ ఆ అవకాశం కొంతమందిని మాత్రమే వరిస్తుంది. తాజాగా బ్లూ ఆరిజిన్ అనే సంస్థ తాము చేపట్టనున్న ఎన్ఎస్-25 మిషన్‌కు కొందరు ఔత్సాహికులను ఎంపిక చేసింది. వారిలో మన తెలుగు కుర్రాడికి అవకాశం దక్కింది. అతడే 30ఏళ్ల గోపీచంద్ తోటకూర. అంతరిక్షంలోకి వెళ్లాలన్న తన కల త్వరలోనే నెరనుండటం చాలా సంతోషంగా ఉందని కూడా ఆయన చెప్పారు. తమ జాబితాలో గోపీచంద్ పేరు ఉన్నట్లు బ్లూ ఆరిజిన్ సంస్థ ఖరారు చేసింది. అంతేకాకుండా మిగిలిన వ్యక్తుల పేర్లను కూడా ప్రకటించింది.

బ్లూ ఆరిజిన్ సంస్థ

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన అంతరిక్ష సంస్థే ‘బ్లూ ఆరిజిన్’. ఈ సంస్థను బెజోస్.. 2000 సంవత్సరంలో స్థాపించారు. ఆ తర్వాత నుంచి అంతరిక్ష సేవల రంగంలో ఈ సంస్థ బాగా రాణించింది. ఈ సంస్థ అనేక అంతరిక్ష ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఎన్ఎస్-25 అనే మిషన్‌ను ఈ సంస్థ చేపట్టింది. ‘‘ఈ మిషన్ అంతరిక్ష ప్రయాణంలో కీలక మలుపు కావడమే కాకుండా అంతరిక్ష పరిశోధనలో సుస్థిరతనూ చాటుతుంది’’అని బ్లూఆరిజిన్ తెలిపింది. పర్యావరణంపై అంతరిక్ష ప్రయాణం చూపుతున్న ప్రభావాన్ని తగ్గించడం, అంతరిక్ష శోధనలో వినియోగించే వస్తువుల పునర్వినియోగం వంటి అంశాలపై దృష్టి పెడుతున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ మిషన్ కోసమే ఆరుగురు వ్యోమగాములను ఎంపిక చేసుకున్నామని సంస్థ వెల్లడించింది.

అసలు ఎవరీ గోపీచంద్ తోటకూరి

గోపీచంద్ తోటకూరు.. విజయవాడకు చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి అంతరిక్ష ప్రయాణంపై ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చాడు. అతడు అనేక రకాల విమానాలు, హాట్ ఎయిర్ బెలూన్లను కూడా నడపగల నైపుణ్యం ఉన్న వ్యక్తి. ఎరోనాటిక్స్ పూర్తి చేసిన తర్వాత అతడు అమెరికాలోనే స్థిరపడ్డాడు. అతడు ప్రిజర్వ్ లైఫ్ అనే వెన్‌నెస్ సెంటర్‌కు సహ వ్యవస్థాపకుడిగా ఉన్నాడు. తాజాగా అతనిని ఎన్ఎస్-25 కోసం బ్లూఆరిజిన్ సంస్థ ఎంపిక చేసింది. కాగా తన ఎంపికను సంస్థ అధికారికంగా ప్రకటించే వరకు తన కుటుంబీకులకు కూడా ఈ విషయాన్ని చెప్పలేదని గోపి వివరించారు.

11 నిమిషాల యాత్ర

బ్లూఆరిజిన్ చేపట్టనున్న ఎన్ఎస్-25 అంతరిక్ష యాత్ర 11 నిమిషాల పాటు సాగనుంది. ఇందులో భాగంగా వ్యోమగాములు ధ్వని వేగం కంటే రెండు మూడు రెట్లు వేగంగా ప్రయాణించనున్నారు. ఆ తర్వాత అంతరిక్షం నుంచి ఓ క్యాప్సూల్‌లో పారాూట్ సహాయంతో భూమిపైకి దిగనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఆరు మిషన్‌లు చేపట్టింది. వాటి ద్వారా 31 మందిని అంతరిక్షంలోకి పంపింది. వీరంతా కూడా సముద్రమట్టానికి 80 నుంచి 100 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి వచ్చారు.

గోపీతో పాటు అంతరిక్షంలోకి వెళ్లనున్న వారిలో వెంచర్ కాపిటలిస్ట్ మానస్ ఏంజెల్, ఫ్రాన్స్ పారిశ్రామికవేత్త సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ వ్యాపారి కెన్నెత్ ఎల్హెస్, సాహస యాత్రికుడు కరోల్ షాలర్, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్ ఉన్నారు.

Read More
Next Story