ఆంధ్ర ప్రకృతి సేద్యానికి అంతర్జాతీయ గుర్తింపు.. ప్రశంసించిన సీఎం
x

ఆంధ్ర ప్రకృతి సేద్యానికి అంతర్జాతీయ గుర్తింపు.. ప్రశంసించిన సీఎం

ఆంధ్రప్రదేశ్ ప్రకృతి సేద్యానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘గుల్బెంకియన్ అవార్డు’ను ఏపీ ప్రకృతి సేద్యం సొంతం చేసుకుంది.


ఆంధ్రప్రదేశ్ ప్రకృతి సేద్యానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘గుల్బెంకియన్ అవార్డు’ను ఏపీ ప్రకృతి సేద్యం సొంతం చేసుకుంది. ఏపీసీఎన్ఎఫ్ ఈ ఖ్యాతిని గడించింది. పోర్చుగల్ రాజధాని లిస్బన్‌లో జరిగిన కార్యక్రమంలో ఏపీ సేద్యానికి ఈ అవార్డును అందించారు. ఈ అవార్డును రైతు సాధికారి సంస్థ, ప్రకృత సాగు రైతు నాగేంద్రమ్మ, ఏపీసీఎన్ఎఫ్ కలిసి ఈ అవార్డును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 117 దేశాలో పాల్గొన్నాయి. అన్ని దేశాల నుంచి మొత్తం 181 నామినేషన్లు దాఖలయ్యాయి.

ఈ పోటీలో 117 దేశాలను పక్కకునెట్టి ఏపీఎన్‌ఎఫ్ ఈ అవార్డును దక్కించుకుంది. భారత సంతతికి చెందిన అమెరికా శాస్త్రవేత్త రతన్ లాల్, ఈజిప్ట్‌కు చెందిన సెకెమ్ స్వచ్ఛంద సంస్థతో కలిసి ఏపీఎన్‌ఎఫ్ ఈ ఘనత సాధించింది. ఈ పురస్కారం కింద విజేతకు మిలియన్ యూరోలు అందుతాయి. ఆ బహుమానాన్ని ముగ్గురు విజేతలకు సమానంగా పంచనున్నారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఏపీ సేద్యానికి ‘గుట్బెంకియన్ అవార్డు’ దక్కడం అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు. ఏపీ చేపట్టిన జీలో వేస్ట్ బేస్డ్ నేచురల్ ఫార్మింగ్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించడం చాలా సంతోషకరమని చెప్పారు.

ఏపీసీఎన్‌ఎఫ్ చరిత్ర ఇది

ఏపీసీఎన్‌ఎఫ్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016లో ప్రారంభించింది. ఈ పథకం సన్నకారు రైతులను వ్యవసాయ ఆధారిత వ్యవసాయం నుంచి సహజ సిద్ధమైన సేద్యం చేసేలా మారుస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా రైతు సాధికారత సాధించాలని ఏపీసీఎన్‌ఎఫ్ ఎంతో కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే పంటల వైవిద్యీకరణ, సేంద్రియ ఎరువుల వినియోగం, దేశీయ విత్తనాలను తిరిగి ప్రవేశపెట్టడం, నేల సారాన్ని రక్షించుకోవడం వంటి అంశాలను రైతులకు వివరిస్తూ వాటిని ఎంతగానో ప్రోత్సహించింది ఏపీసీఎన్‌ఎఫ్. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా మహిళా రైతులు, రైతులతో కలిసి 5 లక్షల హెక్టార్లలో ప్రకృతి సేద్యం చేస్తుందీ రైతు సాధికార సంస్థ.

గుల్బెంకియన్ ఫౌండేషన్ 2020లో ఏర్పాటు చేశారు. మానవాళికి ముప్పుగా మారుతున్న పర్యావరణ మార్పులు, జీవ వైవిద్య నష్టాలు వంటి సమస్యల పరిష్కారం కోసం దీనిని ఏర్పాటు చేశారు. వీటి పరిష్కారం కోసం పాటుపడుతున్న సంస్థలు, వ్యక్తులకు ఈ అవార్డులను అందించి వారిని సత్కరించడం ద్వారా ప్రకృతిని కాపాడుకోవడం పట్ల అందరికీ అవగాహన కల్పించవచ్చనేది ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశం. ప్రతి ఏటా ఈ అవార్డుల కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ఈ ఏడాది విజేతగా ఏపీ సేద్యం నిలిచింది.

Read More
Next Story