ఆంధ్ర ఇంటర్ ఫలితాల్లో మెరిసిన అమ్మాయిలు..
x

ఆంధ్ర ఇంటర్ ఫలితాల్లో మెరిసిన అమ్మాయిలు..

ఆంధ్రలో ఇంటర్మీడియల్ పరీక్షల ఫలితీలు విడుదలయ్యాయి. ఈ సందర్భం ఫెయిల్ అయిన విద్యార్థులకు అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు.


ఆంధ్ర ఇంటర్ విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోజు వచ్చింది. ఆంధ్ర ఇంటర్ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. తాడేపల్లిలోని ఇంటర్ కార్యాలయం నుంచి విద్యా మండలి కార్యదర్శి సౌరబ్ గౌర్ వీటిని రిలీజ్ చేశారు. ఈ ఏడాది కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష రాసిన వారిలో 78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. మొదటి సంవత్సరం విద్యార్థుల్లో 67 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. రెండు సంవత్సరాల ఫలితాల్లో ఆడపిల్లలే పైచేయి సాధించారు. విద్యార్థులు తమ ఫలితాలను resultsbie.ap.gov.in లో చూసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో కృష్ణాజిల్లా టాప్‌లో నిలిచింది. 84 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో గుంటూరు 81శాతం, ఎన్టీఆర్ జిల్లా 79 శాతంతో ఉన్నాయి. చిత్తూరు మాత్రం అత్యల్ప ఉత్తీర్ణత స్థాయితో ఆఖరి స్థానంలో నిలిచింది. రెండో ఏడాది ఫలితాలను చూసుకుంటే వీటిలో కూడా కృష్టా జిల్లాదే అగ్రస్థానం. రెండో సంవత్సర ఫలితాల్లో కృష్ణాజిల్లా 90 శాతం ఉత్తీర్ణత సాధించింది. గుంటూరు 87శాతం, ఎన్‌టీఆర్ జిల్లా 87 శాతం ఉత్తీర్ణత సాధించి తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ఫెయిల్ అయిన వారికి మంచి అవకాశం

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు అధికారులు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. అదే సప్లిమెంటరీ. ఇదెప్పుడూ ఉన్నదేగా అనుకోవద్దు. ఈసారి సప్లిమెంటరీ పరీక్ష రాసి పాస్ అయితే.. మార్క్ లిస్ట్‌లో సప్లిమెంటరీలో పాస్ అయినట్లు ఉండదని అధికారులు వెల్లడించారు. కావున ప్రతి ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

పరీక్షలు ఎంతమంది రాశారంటే

ఈ ఏడాది ఇంటర్ పరీక్షలను సుమారు 9.99 లక్షల మంది విద్యార్థులు రాశారు. ఎన్నికల నేపథ్యంలో మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన పరీక్షల మూల్యాంకన ప్రక్రియను ఏప్రిల్ 4న పూర్తి చేశారు అధికారులు. వాటిని నేడు విడుదల చేశారు. అయితే ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలను 4,73,058 మంది, ద్వితీయ సంవత్సర పరీక్షలను 5,79,163 మంది పరీక్షకుల దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 9.99 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సరం పరీక్షలను బాలురు 2,26,240 మంది రాయగా వారిలో 1,43,688 మంది ఉత్తీర్ణులయ్యారు. అదే విధంగా ప్రథమ సంవత్సరం పరీక్షలను 2.35.033 మంది బాలికలు రాయగా వారిలో 1,67,187 మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో ప్రథమ సంవత్సరం ఫలితాల్లో బాలకలదే పైచేయి అయింది. ద్వితీయ సంవత్సర పరీక్షలను 1,88,849 మంది బాలురు రాయగా వారిలో 1,44,465 మంది ఉత్తీర్ణులయ్యారు. అదే విధంగా 2,04,908 మంది బాలికలు ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు రాయగా వారిలో 1,65,063 మంది పాస్ అయ్యారు. ఈ ఫలితాల్లో కూడా బాలికలదే పైచేయి.

సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇలా

ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించారు. సప్లిమెంటరీ పరీక్షలను రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాల సప్లమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.

Read More
Next Story