
AI తో భూసమస్యల పరిష్కారానికి చర్యలు
వాట్సప్ గవర్నెన్స్ ద్వారా రైతులకు సలహాలు ఇస్తామని మంత్రి అనగాని తెలిపారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రైతు సమస్యలను సత్వరం పరిష్కారం అయ్యేలా చూస్తామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖమంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ద్వారా భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.వాట్సప్ గవర్నెన్స్ ద్వారా సలహాలు ఇస్తున్నామన్నారు.రెవెన్యూ శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించిన తరువాత మంత్రి మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ సమస్యలపై ముఖ్యమంత్రి సీరియస్ గా వున్నారన్నారు.భూములకు ఆధార్, సర్వే నంబర్ల అనుసంధానంతో సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.గ్రీవెన్స్ ద్వారా వచ్చిన 4.63లక్షల ఫిర్యాదుల్లో 3.99 లక్షల ఫిర్యాదులు పరిష్కరించినట్లు తెలిపారు.
2027 చివరి నాటికి భూరీసర్వే పూర్తి
2027 డిసెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు.ప్రతి భూమి సమగ్ర సమాచారం ఉండేలా చర్యలు తీసుకుంటామని, క్యూఆర్ కోడ్ ఉండే పాస్ పుస్తకాలు తీసుకువస్తున్నామని తెలిపారు. వివిధ రకాల భూములకు రంగుల పాస్‌బుక్ కేటాయిస్తామని ,ఆగస్టు 15 నుంచి ఉచితంగా వాటిని పంపిణీ చేస్తామన్నారు.ప్రతి పేదవాడికి నివాసయోగ్యమైన ఇల్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, విలేకరులకు ఇళ్ల కేటాయింపుపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయించినట్లు తెలిపారు.
Next Story