ఏపీలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు
x

ఏపీలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు

ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికే మూడు సార్ల వరకు అధికారుల బదిలీలు జరిగాయి


ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికే మూడు సార్ల వరకు అధికారుల బదిలీలు జరిగాయి. తాజాగా మరోసారి ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 13 మందిని అధికారులు బదిలీ అయ్యారు. అయితే అసలు కూటమి ప్రభుత్వం ఇంతలా ఎందుకు బదిలీలు చేపడుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. గత ప్రభుత్వ హయాంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లో వైసీపీకి తొత్తులుగా వ్యవహరించారని, వైసీపీ చేతిలో కీలుబొమ్మలా ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కూటమి నేతలు కూడా ఇటువంటి విమర్శలు అనేక సార్లు చేశారు. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీరి బదిలీలను చేపడుతున్నారన్న వాదన వినిపిస్తోంది.

బదిలీ అయిన అధికారులు వీరే

ప్రణాళిక సంఘం జాయింట్ సెక్రటరీగా అనంత శంకర్.

స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా పీఎస్ గిరీషా.

కర్నూలు జాయింట్ కలెక్టర్ నవ్య

గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టరుగా ఎస్. భార్గవి.

ఫైబర్ నెట్ ఎండీగా దినేష్ కుమార్.

ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, డ్రోన్ కార్పోరేషన్ ఎండీగా దినేష్ కుమార్కు అదనపు బాధ్యతలు.

'ఏపీ ఎయిర్ పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య.

అనంతపురం జాయింట్ కలెక్టర్గా డి.హరిత

తూర్పు గోదావరి జాయింట్ కలెక్టర్గా ఎస్. చిన్న రాముడు.

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పి.శ్రీనివాసులు.

పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్గా టి.రాహుల్ కుమార్ రెడ్డి.

విజయనగరం జాయింట్ కలెక్టర్గా సేదు మాధవన్.

నెల్లూరు జాయింట్ కలెక్టర్గా కె.కార్తీక్.

Read More
Next Story