స్కూలు కాంప్లెక్స్ లను కుదించిన ప్రభుత్వం
x

స్కూలు కాంప్లెక్స్ లను కుదించిన ప్రభుత్వం

సుమారు రెండు వేల స్కూల్ కాంప్లెక్స్ లను ప్రభుత్వం రద్దు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆదేశాలు అమలు కానున్నాయి.


విద్యా బుద్ధులు నేర్పించే వారికి ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ పై పట్టు పెంచుకునేందుకు ఏర్పాటు చేసిన స్కూలు కాంప్లెక్స్ ల సంఖ్యను తగ్గించాలనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది. ప్రస్తుతం 6వేల వరకు ఆంధ్రప్రదేశ్ లో స్కూలు కాంప్లెక్స్ లు ఉన్నాయి. ఈ స్కూలు కాంప్లెక్స్ ల్లో విద్యార్థలు సంఖ్య కూడా ఎక్కవగానే ఉంటోంది. స్కూలు కాంప్లెక్స్ లను ఎ, బి, కేటగిరీలుగా ప్రభుత్వం విభజించింది. ఒక్కో కేటగిరీ కింద ఎన్ని కాంప్లెక్స్ లు ఉంబాలనేది ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్కూల్ కాంప్లెక్స్ లు తగ్గించడం వల్ల ఖర్చులు ప్రభుత్వానికి బాగా తగ్గుతాయనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

స్కూలు కాంప్లెక్స్ లు అంటే ఏమిటి?

స్కూలు కాంప్లెక్స్ లు అనేవి ఉపాధ్యాయ వర్గాల వారికి మాత్రమే తెలుసు. వీటి గురించి విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అవసరం లేదు. ఒక హైస్కూలులో అన్ని సౌకర్యాలు ఉండే వెంగా చర్యలు తీసుకోవాలి. అంటే ల్యాబ్ లు, గ్రాంథాలయాలు, ఉండాలి. అన్ని రూముల వద్దకు మంచి నీటి సౌకర్యం, పరిశుభ్రమైన బాత్ రూములు, మూత్ర శాలలు, గ్రౌండ్, విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేసేందుకు డైనింగ్ హాలు వంటి సౌకర్యాలు ఉండాలి. ఉపాధ్యాయులకు ఎప్పటికప్పుడు తమ సబ్జెక్ట్ పై పట్టు సాధించేందుకు శిక్షణ ఉంటుంది. వారు స్కూలు కాంప్లెక్స్ కు శిక్షణకు రావాల్సి ఉటుంది. శిక్షణకు వచ్చినప్పుడు వారికి కనీస సౌకర్యాలు లేకుండా ప్రస్తుతం స్కూలు కాంప్లెక్స్ లు చాలా వరకు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అటువంటి స్కూలు కాంప్లెక్స్ లను రద్దు చేసి ఉపాధ్యాయులకు అనువుగా ఉండే చోట మాత్రమే స్కూలు కాంప్లెక్స్ లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా స్కూలు కాంప్లెక్స్ సంఖ్య కుదించడం వల్ల ఉపాధ్యాయులకు రవాణా చార్జీలు కూడా తగ్గుతాయని ప్రభుత్వం చెబుతోంది.

4,034కు స్కూలు కాంప్లెక్స్ లు తగ్గింపు

స్కూలు కాంప్లెక్స్ లు ప్రస్తుతం 6వేల వరకు ఉన్నాయి. ఈ సంఖ్యను 4,034కు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని కారణంగా ప్రభుత్వం ట్రైనింగ్ ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉంది. అంతే కాని ఉపాధ్యాయులకు కానీ, విద్యార్థులకు కానీ ప్రయోజనం అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఈ విధంగా మార్చడం వల్ల క్లస్టర్ ల సంఖ్యను కూడా తగ్గించేందుకు అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం క్లస్టర్ ఇన్చార్జ్ లుగా బీఈడీ పూర్తి చేయని వారు కూడా ఉన్నారు. వీరికి కన్సాలిడేటెడ్ పేమెంట్ ఇస్తున్నారు. తమకంటే తక్కువ చదువుకున్న వారు తమపై పెత్తనం చెలాయించడం ఏమిటనే భావం కూడా చాలా మంది ఉపాధ్యాయుల్లో ఉంది. నిజానికి క్లస్టర్ వ్యవస్థ అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఇద్దరు ఎంఈవోలు ఉన్నారు. క్లస్టర్లలో ఉండే వారు స్కూల్స్ కే వెళ్లి వారు ఇచ్చే వివరాలు తీసుకొచ్చి ఎంఈవోకు ఇవ్వడం మాత్రమే చేస్తున్నారు. స్కూళ్లలో టీచర్లు సెలవులో ఉంటే క్లస్టర్ ఇన్చార్జ్ అవసరమైనప్పుడు స్కూల్లో పాఠాలు కూడా చెప్పాలి. బీఈడీ కూడా పూర్తి చేయని వారు క్లస్టర్ ఇన్ చార్జ్ లుగా ఉన్నప్పుడు వారికి చదువు చెప్పే కెపాసిటీ కూడా అంతగా ఉండదని టీచర్లు అంటున్నారు.

డిప్యూటీ ఎంఈవో వ్యవస్థను రద్దు చేసే అవకాశం

వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిప్యూటీ ఎంఈవో వ్యవస్థను ప్రవేశపెట్టింది. గతంలో మండలానికో విద్యాశాఖ అధికారి మాత్రమే ఉండే వారు ప్రస్తుతం ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉండటం వల్ల ఉపయోగం లేదని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే డిప్యూటీ ఎంఈవో వ్యవస్థను రద్దు చేసేందుకు విద్యాశాఖ మంత్రి లోకేషన్ నిర్ణయించినట్లు సమాచారం. స్కూల్ కాంప్లెక్స్ లు మండలానికి పది నుంచి 15 వరకు ఉన్నాయి. ఈ స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లను ఇకపై స్కూల్స్ విజిట్స్ కు అప్పుడప్పుడు పంపించేందుకు నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. దీని వల్ల చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆలోచనలలో ప్రభుత్వం ఉంది. హెడ్ మాస్టర్లు సీనియర్స్ ఉంటారు కాబట్టి వారు తమ కాంప్లెక్స్ పరిధిలో విజిట్ చేసిన రిపోర్టులు ఎప్పటికప్పుడు ఎంఈవోకు పంపిస్తారు. అందువల్ల ఇబ్బందులు ఉండే అవకాశం కూడా ఉండదు.

Read More
Next Story