ఆంధ్ర ఎన్నికల ప్రచారం ఆదివారం ఇలా..
x

ఆంధ్ర ఎన్నికల ప్రచారం ఆదివారం ఇలా..

ఆంధ్రలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. ప్రధాన పార్టీలన్నీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి.


ఆంధ్రలో ఎన్నికల ప్రచారం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీల నేతలంతా తమ ప్రచారంలో మరింత దూకుడు పెంచారు. ప్రజలతో మమేకం కావడానికి ఎక్కడలేని ఆలోచనలు చేస్తున్నారు. బస్సు యాత్రలు, సైకిల్‌పై ప్రచారాలు, తాజాగా ఒకరు చెట్టెక్కి కూడా మాట్లాడుతూ కనిపించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల అధ్యక్షుల ప్రచారాలు ఆదివారం ఎలా సాగనున్నాయంటే..

సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ యాత్ర ఈరోజు చిన్నయపాలెం నుంచి బయలు దేరుతుంది. పినగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా వేపగుంట జంక్షన్ చేరుకుంటారు. అక్కడ భోజన విరామం ఉంటుంది. ఆ తర్వాత గోపాలపట్నం, ఎన్‌ఏడీ జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజిపాలెం, హనుమంతువాగ మీదుగా ఎంవీవీ సిటీ ఎండాడ చేరుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారు.

అదే విధంగా వైఎస్ షర్మిల ఈరోజు కూడా కర్నూల్‌లో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 10:30కు కర్నూల్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు నందికొట్కూరులో మరో బహిరంగ సభ, రాత్రి 7 గంటలకు నంద్యాలలో మూడో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

జనసేనాని పవన్ కల్యాణ్ ఈరోజు నరసాపురం, భీమవరంలో పర్యటించనున్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు నరసాపురంలో, రాత్రి 7గంటలకు భీమవరంలో ఆయన బహిరంగ సభలు నిర్వహిస్తారు.

Read More
Next Story