పోస్టింగ్ ఇవ్వని ఐపీఎస్‌లకు డీజీపీ ప్రత్యేక ఆదేశాలు
x

పోస్టింగ్ ఇవ్వని ఐపీఎస్‌లకు డీజీపీ ప్రత్యేక ఆదేశాలు

ఏపీలో పోస్టింగ్ ఇవ్వని ఐపీఎస్ అధికారులకు డీజీపీ ద్వారకా తిరుమల రావు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.


ఏపీలో పోస్టింగ్ ఇవ్వని ఐపీఎస్ అధికారులకు డీజీపీ ద్వారకా తిరుమల రావు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం కీలక ఉతర్వులు ఇచ్చారు. పోస్టింగ్ ఇవ్వని ఐపీఎస్‌లు ప్రతిరోజూ డీజీపీ ఆఫీస్లో ఉండాలని.. ప్రతి రోజు ఉదయం 10 గంటలకు డీజీపీ ఆఫీస్‌లో హాజరు వేసుకుని.. ఆఫీసర్స్ వెయిటింగ్ రూమ్లో ఉండాలని సూచించారు. ఏదైనా అత్యవసర పని అప్పగిస్తే వెంటనే వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం పెట్టి వెళ్లాలని స్పష్టం చేశారు.

కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు చేపట్టింది. రెండు నెలలు అవుతున్నా కొంతమంది సీనియర్ ఐపీఎస్‌లకు పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, వారికి అనుకూలంగా పని చేశారన్న ఆరోపణలతోనే పోస్టింగ్ ఇవ్వకుండా పెండింగ్ లో ఉంచారనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో రోజూ డీజీపీ ఆఫీస్ కి వచ్చి అటెండెన్స్ వెయ్యాలి, అర్జెంటు పనుంటే వెళ్ళాలి అని డీజీపీ ఆదేశాలివ్వడం కొత్త చర్చకు దారి తీస్తోంది.

పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఐపీఎస్ అధికారులలో పిఎస్‌ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్, ఎన్ సంజయ్, కాంతి రాణా టాటా, జి పాల రాజు, కొల్లి రఘురామ్ రెడ్డి, ఆర్‌ఎన్ అమ్మి రెడ్డి, సిహెచ్ విజయరావు, విశాల్ గున్ని, అన్బురాజన్ కెకెఎన్, వై రవిశంకర్ రెడ్డి, వై. రిశాంత్ రెడ్డి, కె రఘువీరా రెడ్డి, పి పరమేశ్వర్ రెడ్డి, పి జాషువా, కృష్ణకాంత్ పటేల్ ఉన్నారు.

Read More
Next Story