‘అడవితల్లి బాట’ పనులను వేగవంతం చేయాలి
x

‘అడవితల్లి బాట’ పనులను వేగవంతం చేయాలి

పంచాయతీరాజ్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు


రాష్ట్ర పంచాయతీరాజ్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.గిరిజన ప్రాంతాల్లో ‘అడవి తల్లి బాట’ పేరిట చేపట్టిన నూతన రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, పనులు పూర్తయితే 625 గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం ఏర్పాటవుతుందని పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోడ్ల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. రెండు వారాలకు ఒకసారి శాఖాపరంగా సమీక్షించి నిర్మాణ పురోగతిపై నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు.

డోలీ రహిత గిరిజన ఆవాసాలే లక్ష్యం
సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, డోలీరహిత గిరిజన ఆవాసాలు ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అధికారులందరి సమష్టి కృషితోనే ఇది సాధ్యపడుతుందని చెప్పుకొచ్చారు.ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పీఎం జన్‌మన్ పథకం ద్వారా రూ.555.6 కోట్లు నిధులు కేటాయించి సహకారం అందించిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. అదే విధంగా జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించుకొంటున్నట్లు వివరించారు. ఇన్ని అవకాశాలు ఉన్నందున అడవి తల్లి బాట పనుల విషయంలో అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆయన సూచించారు. స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారి రోడ్డు సౌకర్యం పొందే ఆవాసాలు కూడా ఈ పథకంలో ఉన్నాయని గుర్తుచేశారు. గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన పనుల గురించి స్థానికులకు కూడా తెలియజేయడం ఎంతో అవసరని అభిప్రాయపడ్డారు. డోలీరహిత ఆవాసాలు ఉండాలనే సంకల్పంతో చేపట్టిన విషయాన్ని చెప్పాలని పేర్కొన్నారు. తద్వారా వారి సహకారం, ప్రోత్సాహం కూడా లభిస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
గిరిజన ప్రాంతాలలో రోడ్ల నిర్మాణంలో సవాళ్లను, అవరోధాలను అధికారులు కూడా పవన్ కు వివరించారు. కొండలపై ఉన్న ఆవాసాలను అనుసంధానిస్తూ కొత్త రోడ్డు రూపకల్పన చేసేందుకు బండరాళ్లను బద్ధలుకొడుతూ ముందుకు వెళ్ళేందుకు అధిక సమయం తీసుకొంటోందని తెలిపారు. అదే విధంగా నిటారుగా ఉన్న ప్రాంతాలు కావడంతో రోడ్ల నిర్మాణంలో పలు జాగ్రత్తలు పాటిస్తున్నామన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తూ ఉండటంతో పనుల వేగం తగ్గింద్దని వివరించారు. 128 రోడ్లు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉండడం వల్ల అటవీ అనుమతులు కోరగా ఇప్పటికే 98 రోడ్లకు వచ్చాయని తెలిపారు. ఇప్పటి వరకు 186 పనులు చేపట్టగా, మరో 20 పనులు టెండర్ దశలో ఉన్నట్టు అధికారులు వివరించారు. టెక్నికల్ ఎవాల్యుయేషన్ ప్రక్రియ చేపడుతున్నామన్నారు.
Read More
Next Story