జగన్ నొక్కిన బటన్లన్నీ నా పింఛన్లతో సమానమన్న చంద్రబాబు
x
బాపట్ల జిల్లాలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు

జగన్ నొక్కిన బటన్లన్నీ నా పింఛన్లతో సమానమన్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కోటిన్నర కుటుంబాలలో 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.


ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కోటిన్నర కుటుంబాలలో 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. పింఛన్ల పంపిణీకి ఏడాదికి రూ.33,100 కోట్లు ఖర్చవుతోందన్నారు. ఒకప్పుడు నొక్కిన బటన్లన్నీ తాను ఇచ్చే పింఛన్లతో సమానమని పరోక్షంగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి అన్నారు. పింఛన్ల రూపంలో నెలకు రూ.2,722 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు.
బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్త గొల్లపాలెంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఏప్రిల్ 1 మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందించారు.
తనకు అన్నింటి కంటే ప్రధానం ప్రజలేనని చెప్పుకొచ్చారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన అనంతం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటానని గతంలో చెప్పానని, ఆ మాట ప్రకారం ముందుకు వెళుతున్నానని చెప్పారు.
‘‘పెంచిన పింఛన్లను గత ఏప్రిల్‌ నుంచే అమలు చేస్తున్నాం. దివ్యాంగులకు రూ.6వేల పింఛన్లు ఇస్తున్నాం. కోటిన్నర కుటుంబాలకు గానూ 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నాం. కొందరికి సంపాదించే దానికంటే ఎక్కువ ఆదాయం వస్తోంది. పింఛన్ల పంపిణీ కోసం ఏడాదికి రూ.33,100 కోట్లు ఖర్చవుతోంది. ఒకప్పుడు నొక్కిన బటన్లన్నీ నేను ఇచ్చే పింఛన్లతో సమానం. పింఛన్ల రూపంలో నెలకు రూ.2,722 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గతంలో ఒక నెల పింఛన్‌ తీసుకోకపోతే ఆ డబ్బు వచ్చే పరిస్థితి లేదు. ఒక నెల తీసుకోకపోతే.. రెండు లేదా మూడో నెల తీసుకునే అవకాశం ఇచ్చాం. రెండు నెలలు పింఛన్లు తీసుకోని వారు 93,300 మంది ఉన్నారు. మిగుల్చుకోవాలంటే నెలకు రూ.76 కోట్లు ప్రభుత్వానికి మిగులుతుంది. పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో అదనంగా రూ.76 కోట్లు ఇస్తున్నాం. పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
చరవేగంగా అమరావతి రాజధాని పనులు
రాజధాని అమరావతి పనులు శరవేగంతో జరుగుతున్నాయన్నారు. "రాజధాని అభివృద్ధి చెందితే ఆదాయం వస్తుంది. దాని ద్వారా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు అవకాశం కలుగుతుంది. మూడు నాలుగేళ్లలో మళ్లీ అమరావతికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్రానికి పోలవరం జీవనాడి. 2027 నాటికి ఆ ప్రాజెక్టును పూర్తిచేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతాం. గత పాలకులు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను దివాళా తీయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.11వేలకోట్లు కేంద్రం ఇచ్చింది. స్టీల్‌ ప్లాంట్‌ కూడా గాడిన పడింది. విశాఖకు రైల్వే జోన్‌ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మతుల చేపట్టాం. మిగిలిన చోట కూడా పూర్తిచేస్తాం. ఈనెలలో మెగా డీఎస్సీ ప్రక్రియ ప్రారంభించి జూన్‌లోపు ఉద్యోగాలు ఇస్తాం’’ అని చంద్రబాబు అన్నారు.
Read More
Next Story