చంద్రబాబు తొలి కలెక్టర్ల సమావేశం ప్రారంభం
x

చంద్రబాబు తొలి కలెక్టర్ల సమావేశం ప్రారంభం

జగన్మోహన్ రెడ్డి సృష్టించిన 26 జిల్లాల కలెక్టర్లతో సమావేశమయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు


అమరావతి,5 ఆగష్టు: రాష్ట్ర సచివాలయం 5వ భవనంలో సోమవారం నిర్వహిస్తున్న కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది.


ఈసమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్,ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా,సిసిఎల్ఏ జి.జయలక్మి,పలువురు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు,ముఖ్య కార్యదర్శులు,కార్యదర్శులు, శాఖాధిపతులు,జిల్లా కలెక్టర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశం హాల్లో ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఉండకపోయినా ఆయన ముద్ర బలంగా కూడా కనిపిస్తూఉంది. కారణం 2014-19 మధ్య ఉన్న 13 జిల్లాలను, జగన్ 2023 పిబ్రవరిలో 26 గా పెంచారు. కుప్పం వంటి మండల కేంద్రాలు కొన్నింటిని రెవెన్యూ డివిజన్ స్థాయికి పెంచారు. దాంతో మొదటిసారి 26 జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహిస్తున్నారు.


ఒక రోజు కలక్టర్ల సమావేశానికి సంబంధించి ఉ.10గం.ల నుండి ఉ.11.15గం.ల వరకు ప్రారంభ(Inaugural Session)కార్యక్రమం సాగింది.సియం కీలకోపన్యాసం,డిప్యూటీ సియం సందేశం,రెవెన్యూ శాఖ మంత్రి ప్రారంభ సందేశం చేయనుండగా సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడనుండగా సిసిఎల్ఏ జి.జయలక్మి స్వాగతం పలికారు.

ఉ.11.15 గం.ల నుండి 12.25 గం.ల వరకు ప్రాధమిక రంగం,12.25గం.ల నుండి 12.55 గం.ల వరకు సహజ వనరులపై సమీక్షిస్తారు.తదుపరి 12.55గం.ల నుండి 1.50.గం.ల వరకు సెకండరీ సెక్టార్, మౌలిక సదుపాయాలపై సమీక్షిస్తారు.భోజన విరామం అనంతరం 2.45గం.ల నుండి 3.30గం.ల వరకు మానవ వనరులు,3.30 నుండి 4.20.గం.ల వరకు సోషల్ సెక్టార్, సంక్షేమం,4.20.గం.ల నుండి 4.40.గం.ల వరకు హెల్తు సెక్టార్,4.50గం.ల నుండి 5.40గం.ల వరకు అర్బన్ మరియు రూరల్ డెవలప్మెంట్,5.40.గం.ల నుండి 5.50 గం.ల వరకు సర్వీస్ సెక్టార్,5.50.గం.ల నుండి 6.20.గం.ల వరకు రెవెన్యూ, ఎక్సైజ్ శాఖలపై సమీక్షిస్తారు.6.20.గం.ల నుండి 7గం.ల వరకు శాంతి భద్రతలు,7గం.ల నుండి 7.30.గం.ల వరకు ఓపెన్ హౌస్,7.30.గం.ల నుండి 7.45.గం.ల వరకు క్లోజింగ్ రిమార్కలు,తదుపరి వందన సమర్పణ ఉంటుంది.


Read More
Next Story