
సింగపూర్ చేరిన చంద్రబాబు బృందానికి ప్రవాసాంధ్రుల స్వాగతం
ప్రవాసాంధ్రలు, పారిశ్రామిక వేత్తలు చంద్రబాబుకు సింగపూర్ లో ఘన స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) నేతృత్వంలోని 8 మంది బృందం ఐదు రోజుల పర్యటనలో భాగంగా సింగపూర్ చేరింది. జూలై 27 ఉదయం సింగపూర్ చేరుకున్న సీఎం బృందానికి ప్రవాసాంధ్రులు, పారిశ్రామికవేత్తలు స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రధారణలో చంద్రబాబుకు ఆహ్వానం పలికేందుకు అక్కడి తెలుగు కుటుంబాలు పెద్ద ఎత్తున తరలి వచ్చాయి. చిన్నారులు కూచిపూడి నాట్యంతో ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రధారణలో తెలుగు కుటుంబాలకు చెందిన మహిళలు తరలి వచ్చారు.. హారతులు పట్టారు.
సీఎం బస చేస్తున్న హోటల్ ప్రాంగణంలో తెలుగు కుటుంబాల సందడి నెలకొంది. సింగపూర్ పర్యటనలో భాగంగా మొత్తం 29 కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇవాళ మధ్యాహ్నం తెలుగు డయాస్పోరా సమావేశానికి ముఖ్యమంత్రి, మంత్రులు నారా లోకేష్, పి.నారాయణ, టీజీ భరత్ లు హాజరు కానున్నారు.
తొలిరోజు పర్యటన ఇలా :
-ఉదయం 11:00 నుంచి 11:30 గంటల వరకు భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో షాంగ్రీ-లా హోటల్ వాలీ వింగ్‌లో సమావేశం కానున్న ముఖ్యమంత్రి
-ఉదయం 11:30 నుంచి 12:00 గంటల వరకు సుర్భా జురాంగ్ సంస్థ ప్రతినిధులు చెర్ ఎక్‌లో, రిక్ యియో, జిగ్నేష్ పట్టానీలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి
-మధ్యాహ్నం 12:00 నుంచి 12:30 గంటలకు ఎవర్‌సెండాయ్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ తన్ శ్రీ డాటో ఏ.కె. నాథన్ తో పెట్టుబడులపై చర్చ
-మధ్యాహ్నం 2:00 నుంచి 6:30 గంటల వరకు OWIS ఆడిటోరియంలో జరిగే తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమానికి సీఎం
-సాయంత్రం 7:00 నుంచి 9:00 గంటల మధ్య భారత హైకమిషనర్ నివాసంలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, డయాస్పోరా నేతలతో విందు సమావేశంలో సీఎం పాల్గొంటారు.
Next Story