Photo source: Observer Research Foundation
x

అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్: సీఎం చంద్రబాబు సీరియస్, బాలకృష్ణ ఆగ్రహం

పొట్టకూటి కోసం వలస వచ్చిన అత్తాకోడళ్లపై సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో దారుణం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటనపై సీరియస్ అయ్యారు.


సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో జరిగిన దారుణ సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదలొద్దని పోలీసులను ఆదేశించారు. రాష్ట్ర హోం మంత్రి అనిత కూడా ఈ ఘటనపై వివరాలు తక్షణమే పంపాల్సిందిగా జిల్లా పోలీసు అధికారిని కోరారు.

అసలేం జరిగిందంటే...
చిలమత్తూరు మండలంలో దసరా పండగ వేళ ఓ దుండగుల ముఠా అత్తాకోడళ్లపై అత్యాచారానికి పాల్పడింది. పొట్టకూటి కోసం వలస వచ్చిన ఓ కుటుంబంపై విచక్షణారహితంగా లైంగిక దాడికి తెగపడ్డారు. తెల్లవారుజాము సమయంలో కత్తుతో బెదిరించిన ఈ దారుణానికి ఒడిగట్టారు. ఇంట్లోని మగవాళ్లను తాళ్లతో కట్టేసి ఆ మహిళలపై దాడి చేశారు. నిందితుల కోసం పోలీసులు వేటాడుతున్నారు. .
కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన నలుగురు సభ్యుల కుటుంబం చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామం వద్ద పేపర్ మిల్లు కర్మాగారంలో వాచ్‌మెచ్‌గా పని చేస్తున్నారు. ఈవేళ అంటే అక్టోబర్ 12 తెల్లవారుజామున రెండు మోటారు సైకిళ్లపై నలుగురు దుండగులు ఫ్యాక్టరీ వద్దకు వచ్చారు. ఎవరని వాచ్ మెన్ ప్రశ్నించేలోపే ఒక్కసారిగా కత్తులతో దుండగులు దాడికి తెగబడ్డారు. తండ్రి కుమారుడిని తీవ్రంగా గాయపరిచారు. అత్తా, కోడలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత పరారయ్యారు. రాత్రి వేళ కావడంతో వారి ఆగడాలను అడ్డుకునేందుకు ఎవరూ లేకుండా పోయారు. ఈ ఘటనపై బాధితులు చిలమత్తూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సంఘటనా స్థలానికి వెళ్లారు. వివరాలు తెలుసుకున్నారు. నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఎస్పీని కోరారు. ఈ ఘటనపై మంత్రి సవిత కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఉపాధి కోసం వచ్చిన కుటుంబ సభ్యులను బంధించి అత్తా కోడలిపై అఘాయిత్యానికి పాల్పడిన వారిని క్షమించరాదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సవిత హామీ ఇచ్చారు.


Read More
Next Story