70 అజెండా అంశాలపై మూడున్నర గంటల చర్చ
x

70 అజెండా అంశాలపై మూడున్నర గంటల చర్చ

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ఆక్రమణలను తాను హెలికాప్టర్ నుంచి వీడియో తీశానని చెప్పారు. త్వరలోనే ఈ వీడియో రిలీజ్ చేస్తానని తెలిపారు.


మొంథా తుపాను సమయంలో ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు తక్షణ సాయం అందేలా చేశారని మంత్రులను సీఎం అభినందించారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం సోమవారం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ భేటీ మూడున్నర గంటలపాటు సాగింది. సుమారు 70 అజెండా అంశాలపై మంత్రులతో సుధీర్ఘ చర్చలు జరిపారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వ్యవస్థ ఏర్పాటు, సంస్థలకు భూముల కేటాయింపుపై సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలు, వివిధ పరిశ్రమల ఏర్పాటులో భూ కేటాయింపునకు రాయితీలు, రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ తదితర కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

అజెండాపై చర్చల అనంతరం వివిధ అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. మొంథా తుపాను సమయంలో ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు తక్షణ సాయం అందేలా చేశారని మంత్రులను అభినందించారు. అధికారులతో సమన్వయంతోనే సహాయక చర్యలు వేగంగా అందాయని చెప్పారు. ఆర్టీజీఎస్‌ నుంచి నిరంతర పర్యవేక్షణతో ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించగలిగామన్నారు. సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలే వస్తాయని పేర్కొన్నారు. అందరూ కలిసి ఎలా కష్టపడి పనిచేశారో స్వయంగా చూశానంటూ మంత్రులను సీఎం మరోసారి అభినందించారు.

పేదలందరికీ ఇళ్ల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు. నివాస స్థలం లేనివారి జాబితా రూపొందించి అందరికీ దక్కేలా చూడాలని చెప్పారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో చొరవ తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం తగదన్నారు. త్వరతగతిన సమస్యల పరిష్కారానికి సరైన విధానం రూపొందించాలని చెప్పారు. రాష్ట్రంలోని పేదలందరికీ గృహ సదుపాయం కల్పించే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నివాస స్థలం లేని వారందరి అర్హుల జాబితా రూపొందించి అందరికీ హౌస్ సైట్స్ దక్కేలా చూడాలన్నారు. సంవత్సరంలోగా నివాస స్థలం లేని వారికి లబ్ది చేకూరేలా ప్రభుత్వ చర్యలు ఉండాలని సూచించారు.

ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా బాధ్యత తీసుకునేలా ఇన్‌ఛార్జ్ మంత్రులు చొరవ చూపాలని సీఎం దిశానిర్దేశం చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం విషయంలో జాప్యం తగదని అన్నారు. త్వరితగతిన సమస్యల పరిష్కారానికి సరైన విధానం రూపొందించాలని సూచించారు. వైజాగ్ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ద్వారా యువతకు మనం ఏం చేస్తున్నామో తెలియజేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. పాఠశాలల్లో వాళ్లకు ఎవరికైన ఆసక్తి ఉంటే వాళ్ళు ఈ పార్ట్‌నర్‌‌షిప్ సమ్మిట్ చూసే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకోసం మంత్రులు పనిచేయాలన్నారు. పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు ఉప రాష్ట్రపతి వస్తున్నారని.. పుట్టపర్తిని ఆధ్యాత్మిక కేంద్రంగా చేయాలని సీఎం సూచించారు. ఈ సమ్మిట్‌కు ప్రెసిడెంట్, ప్రధాని, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, చాలామంది వస్తున్నారని చెప్పారు. కూటమి ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పు చేస్తుంటే.. ఇన్‌చార్జి మంత్రులు జోక్యం చేసుకుని సరిచేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

ఈ విషయాన్ని కూటమి ఎమ్మెల్యేలకు మంత్రులే వివరంగా చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు ఎజెండాగా పెట్టుకుని ఇంచార్జి మంత్రులు పరిష్కారం చేయాలని ఆదేశించారు. అనంతపురంలో రెవెన్యూ సమస్యలను రెవెన్యూ అధికారులందరూ కూర్చోబెట్టి పరిష్కారం చేశారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. అనేక వివాదాలకు సంబంధించి రెండు పార్టీలు రాజీ పడినప్పటికీ కొంతమంది ప్రజాప్రతినిధులు ఒప్పుకోవడం లేదన్నారు. మంత్రులు ఈ విషయమై ఎమ్మెల్యేలందరికీ గట్టిగా చెప్పాలని అన్నారు. ఎర్ర చందనం విషయంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ఆక్రమణలను తాను హెలికాప్టర్ నుంచి వీడియో తీశానని చెప్పారు. త్వరలోనే ఈ వీడియో రిలీజ్ చేస్తానని తెలిపారు.

Read More
Next Story