
భూసేకరణ నోటిఫికేషన్‌ను వెనక్కి–ఏపీ ఏపీ క్యాబినెట్ నిర్ణయం
అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న 13 బిల్లులు, వాటికి సంబంధించిన అంశాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
రాజధాని అమరావతి పరిధిలో ఇదివరకు 343 ఎకరాలకు సంబంధించి ఇచ్చిన భూ సేకరణ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. శుక్రవారం రెండో రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు అంశాలకు ఆమోదం తెలిపారు. లిప్ట్‌పాలసీ కింద చిన్న సంస్థల ఏర్పాటుకు భూములు కేటాయింపునకు సంబంధించి క్యాబినెట్‌లో చర్చించిన అనంతరం ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని పలు భూములను అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్‌కు కన్వర్షన్ ప్రతిపాదనలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఏపీ జీఎస్టీ బిల్ 2025లో పలు సవరణలు చేస్తూ రూపొందించిన ప్రతిపాదనలను ఆమోదించింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టే బిల్లులకు కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.