70వేల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
x

70వేల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఆంధ్రప్రదేశ్‌ మంత్రి వర్గ సమావేశం జరిగింది.


ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం రూ. 70వేల కోట్ల పెట్టబడులకు ఆంధ్రప్రదశ్‌ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వీటన్నింటినీ గ్రౌండ్‌ చేస్తే దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు దక్కుతాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో కేబినెట్‌ సమావేశం జరిగింది. దీనికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో పాటు మంత్రులందరూ హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో విశాఖలో పలు సంస్థల ఏర్పాటు, వాటికి స్థలాల కేటాయింపు వంటి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన రూ. 70వేల కోట్ల పెట్టుబడులను మంత్రులు, ప్రభుత్వం వెంటబడి గ్రౌండింగ్‌ చేయించాలని సూచించారు.

ఒక్క రంగం కాదని ఐటీతో పాటుగా ఎనర్జీ, రెన్యువబుల్‌ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్, ఆటోమొబైల్‌ వంటి అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. పలు సంస్థలకు ఇచ్చే భూముల కేటాయింపులపై కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇల్లులేని పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. క్వాంటమ్‌ వ్యాలీతో పాటు గ్రీన్‌హైడ్రోజన్‌ వ్యాలీ అంశాల్లో కూడా అందరి కంటే ముందుండాలని సీఎం సూచించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత సింగపూర్‌ ఏపీకి ఎంతో సహాయం చేసిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సింగపూర్‌ కన్సార్టియం నిర్వాహకులు అమరావతి సీడ్‌ క్యాపిటల్‌ మినహా తక్కిన ఏ ప్రాజెక్టు అయినా చేపట్టేందుకు ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తోందని సీఎం పేర్కొన్నారు.

2024–25 ఏడాదికి గాను నీటి పన్నుపై వడ్డీని పూర్తిగా రద్దు చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. తిరుపతి తొక్కిసలాడ ఘటనపై జస్టిస్‌ సత్యనారాయణ మూర్తి ఇచ్చిన కమిషన్‌ నివేదిక ఆధారంగా అధికారులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. కేబినెట్‌ సమావేశం అనంతరం మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఏపీ ఎలక్ట్రానిక్స్‌ తయారీ పాలసీకి ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పరిశ్రమలకు ప్రోత్సహకాలు ఉంటాయన్నారు. ఏపీలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ పాలసీ ఆ్వరా ఉత్తరప్రదేశ్‌తో పాటు గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలు కూడా లబ్ధిపొందుతాయన్నారు. ఏపీలో 150 బిలియన్‌ డాలర్ల బిజినెస్‌ లక్ష్యంగా ఏపీ ఎలక్ట్రానిక్స్‌ తయారీ పాలసీని రూపొందించినట్లు తెలిపారు. చాల సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తునానయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్‌ఐపీబీ)కి వచ్చిన ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు.
Read More
Next Story