
ఏపీ అసెంబ్లీ 10 రోజులు–ఈ అంశాలపైన చర్చలు
ప్రశ్నోత్తరాలతో పాటు జీరో అవర్‌లో కూడా తప్పనిసరిగా మంత్రులందరూ హాజరు కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు పది రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ మేరకు అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గురువారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబరు 30 వరకు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. అయితే సమావేశాల మధ్యలో 20, 21, 28వ తేదీల్లో సమావేశాలకు సెలవు ఉంటుంది. తక్కిన రోజుల్లో పూర్తి స్థాయిలో సమావేశాలు జరపాలని నిర్ణయించారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
అయితే సభలో ఎన్ని అంశాలపైన చర్చలు జరపాలనే దానిపైన కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున 18 అంశాలపైన చర్చలు జరపాలని ప్రతిపాదించగా, బీజేపీ 9 అంశాలపైన చర్చలు జరపాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంతో పాటుగా జీరో అవర్‌లో కూడా మంత్రులందరూ తప్పకుండా హాజరు కావాలని ఆదేశించారు. సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు గురువారం నాడు జీఎస్టీ సంస్కరణలపైన శాసన సభలో చర్చ జరపాలని నిర్ణయించారు. శుక్రవారం జలవనరుల అంశం, 22న శాంతి భద్రతల అంశం, 23న వైద్య ఆరోగ్యం, 24న పరిశ్రమలు, 25న సూపర్ సిక్స్, 26న క్వాంటం వ్యాలీ, 27న లాజిస్టిక్స్, 29న స్వర్ణాంధ్ర దిశగా ఆంధ్రప్రదేశ్, ఆఖరి రోజు సెప్టెంబరు 30న రాయలసీమ–కోస్తా–ఉత్తరాంధ్ర అభివృద్ధి అంశాలపైన చర్చలు జరపాలని నిర<యించారు.