ఏపీ పదో తరగతి ఫలితాలు..తెలుసుకోండి ఇలా
x

ఏపీ పదో తరగతి ఫలితాలు..తెలుసుకోండి ఇలా

పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే అగ్రస్థానంలో నిలిచింది.


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం పదో తరగతి ఫలితాలను విడుదల చేసింది. మంత్రి నారా లోకేష్‌ బుధవారం ఉదయం 10 గంటలకు పదో తరగతి ఫలితాలను సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా విడుదల చేశారు. ఈ విద్యా సంవత్సరలంఓ 6,19,286 మంది టెన్త్‌ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లీషు మీడియంలో 5,64,064 మంది, తెలుగు మీడియంలో 51,069 మంది పరీక్షలు రాశారు.

వీరిలో 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారని మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 81.14 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే పార్వతీపురం మన్యం జిల్లా ఎక్కువ ఉత్తీర్ణత శాతం సాధించి అగ్ర స్థానంలో నిలిచింది. 93.90 శాతం ఉత్తీర్ణత రేటుతో తొలి స్థానం కైవసం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 1,680 పాఠశాలలు వందకి 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఈ సందర్భంగా పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్‌ అయిన వారి పట్ల కూడా మంత్రి లోకేష్‌ స్పందించారు. ఈ పరీక్షలో ఫెయిల్‌ అయిన వారు నిరుత్సాహపడొద్దని, జీవితం రెండో అవకాశాన్ని అందిస్తుందని, సప్లెమెంటరీ పరీక్షలు రాసి పాసయ్యేందుకు అవకాశం ఉంది, ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ పాస్‌ కావచ్చని తెలిపారు. సప్లెమెంటరీ పరీక్షలు మే 19వ తేదీ నుంచి మే 28 వరకు జరుగుతాయని, విజయం సాధించడానికి మరో అవకాశాన్ని ఇది అందిస్తుందని మంత్రి నారా లోకేష్‌ తెలిపారు.
మన మిత్ర వాట్పాప్‌తో పాటు లీప్‌ యాప్‌లు, వెబ్‌సైట్‌ల ద్వారా పదో తరగతి ఫలితాలను తెలుసుకోవచ్చు. https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in వెబ్ సైట్స్ ద్వారా పదో తరగతి ఫలితాలను తెలుసుకోవచ్చు. దీంతో పాటుగా వాట్సాప్‌ నంబర్‌ 9552300009 ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఈ నంబర్‌కు హాయ్‌ అని మెస్సేజ్‌ చేయాలి. తర్వాత సేవను ఎంచుకోండనే ఆప్షన్‌ వస్తుంది. దీనిలో విద్యా సేవలను సెలెక్ట్‌ చేసుకోవాలి. తర్వాత ఎస్‌ఎస్‌సీ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను సెలెక్ట్‌ చేసుకోవాలి. ఇక్కడ విద్యార్థి రోల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. తర్వాత ఫలితాలను పొందొచ్చు. దీంతో పాటుగా ఈ ఫలితాలను పీడీఎఫ్‌ రూపంలో కూడా డౌన్‌లోడ్‌ చేసుకొవచ్చు.
రెగ్యులర్‌ పదోతరగతి ఫలితాలతో పాటు ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి, ఇంటర్‌ ఫలితాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఓపెన్‌ స్కూల్‌ టెన్త్, ఇంటర్‌ ఫలితాలను https://apopenschool.ap.gov.inవెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.
Read More
Next Story