
ఏపీలో పదో తరగతి పరీక్షలు 2026 ఎప్పుడంటే..
ఆంధ్రప్రదేశ్ SSC (పదో తరగతి) పరీక్షలు 2026 అధికారిక టైమ్‌టేబుల్ విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ (BSEAP) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ను అధికారికంగా విడుదల చేసింది. షెడ్యూల్ లో పేర్కొన్న ప్రకారం..
పరీక్షల తేదీలు & సబ్జెక్టులు
- మార్చి 16, 2026 (సోమవారం) – ఫస్ట్ లాంగ్వేజ్ (కంపోజిట్ కోర్సు సహా)
- మార్చి 18, 2026 (బుధవారం) – సెకండ్ లాంగ్వేజ్ (హిందీ/తెలుగు/స్పెషల్ ఇంగ్లీష్ మొదలైనవి)
- మార్చి 20, 2026 (శుక్రవారం) – ఇంగ్లీష్
- మార్చి 23, 2026 (సోమవారం) – మ్యాథమెటిక్స్
- మార్చి 25, 2026 (బుధవారం) – ఫిజికల్ సైన్స్ (భౌతిక శాస్త్రం)
- మార్చి 28, 2026 (శనివారం) – బయోలాజికల్ సైన్స్ (జీవశాస్త్రం)
- మార్చి 30, 2026 (సోమవారం) – సోషల్ స్టడీస్ (సాంఘిక శాస్త్రం)
- మార్చి 31, 2026 (మంగళవారం) – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 (కంపోజిట్ కోర్సు విద్యార్థులకు)
- ఏప్రిల్ 1, 2026 (బుధవారం) – OSSC సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 (సంస్కృతం/అరబిక్/పర్షియన్ విద్యార్థులకు)
పరీక్ష సమయం
- ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు
- హాల్ టికెట్లు ఫిబ్రవరి మొదటి వారంలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.
విద్యార్థులు ఈ షెడ్యూల్ ప్రకారం సన్నద్ధం కావాలని, పరీక్ష కేంద్రాల్లో 30 నిమిషాల ముందుగా హాజరు కావాలని బోర్డు సూచించింది. మిగిలిన వివరాలకు ఈ వెబ్‌సైట్ ను సంప్రదించాలని సూచించారు. అధికారిక వెబ్‌సైట్: bse.ap.gov.in
Next Story

