ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను
x

ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను

ఈ నెల 14 నుంచి 16 మధ్యలో భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.


ఇటీవల సంభవించిన వరదల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు వచ్చిపడింది. దీని వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ప్రమాదం పొంచి ఉంది. దక్షిణ బంగాళఖాతంలో శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ దిశగా పయనించి, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. ఈ నెల 13 నుంచి 15 మధ్య వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తర్వాత తీవ్ర వాయుగుండంగా బలపడి అక్టోబరు 17 నాటికి ఆంధ్రప్రదేశ్‌లోనే తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావిస్తోంది. ఈ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఈ నేపథ్యంలో ఏలూరు, ప్రకాశం, పశ్చమ గోదావరి, పల్నాడు, శ్రీ సత్యసాయి తదితర జిల్లాల్లో గురువారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

Read More
Next Story