AlluArjun Bribe|బన్నీకి పోలీసులు మరో షాక్ ?
x

AlluArjun Bribe|బన్నీకి పోలీసులు మరో షాక్ ?

ఏసీపీ విష్ణుమూర్తి మీడియాతో చేసిన వ్యాఖ్యలే ఈ అనుమానానికి హేతువుగా నిలుస్తున్నాయి.


పుష్పరాజ్ అలియాస్ అల్లుఅర్జున్ ను ఇప్పుడిప్పుడే పోలీసులు వదిలేట్లులేరు. ఏసీపీ విష్ణుమూర్తి మీడియాతో చేసిన వ్యాఖ్యలే ఈ అనుమానానికి హేతువుగా నిలుస్తున్నాయి. ఇంతకీ విష్ణుమూర్తి ఏమన్నారంటే బాధితులకు అల్లుఅర్జున్(Alluarjun bribe) లంచం ఇస్తున్నట్లుందన్నారు. ప్రెస్ మీట్లో పుష్పరాజ్ మాట్లాడిన మాటలను కోర్టు దృష్టికి తీసుకెళ్ళి బెయిల్ రద్దుచేయించేందుకు ప్రయత్నించబోతున్నామనే అర్ధంవచ్చేట్లుగా చెప్పారు. బెయిల్ రద్దుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారంటే బాధిత కుటంబానికి తనతో పాటు పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ తో పాటు మరికొందరి సాయంతో డబ్బులు జమచేసి ట్రస్టు పెట్టి ఆదుకోవాలని చెప్పినందుకు. మీడియాతో అల్లుఅర్జున్ ఏమన్నారంటే బాధిత కుటుంబానికి డబ్బులు సాయం చేయబోతున్నట్లు చెప్పాడు. తనతో పాటు సుకుమార్ కొంత డబ్బును వేసుకుని ట్రస్టు ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పాడు. ఆ ట్రస్టు ద్వారానే కోమాలో ఉన్న శ్రీతేజ వైద్యంచేయించటంతో పాటు ఇతర అవసరాల్లో ఆదుకుంటామని చెప్పాడు.

దీన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఒకవైపు కేసు కోర్టు విచారణలో ఉన్నపుడు బాధిత కుటుంబానికి డబ్బులను లంచంగా ఇస్తున్న సంకేతాలు పంపటం ఏమిటంటే మండిపోతున్నారు. కోర్టులో కేసువిచారణ జరుగుతున్నపుడు బాధిత కుటుంబానికి ట్రస్టు ద్వారా డబ్బుసాయం చేస్తామని చెప్పటం లంచంఇచ్చి ప్రలోభాలకు గురిచేయటంగానే చూడాల్సుంటుందని ఏసీపీ చెప్పారు. ఈ పాయింట్ మీదే పుష్పరాజ్(Pushapa Movie) కు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను రద్దుచేయాలని పిటీషన్ వేయబోతున్నట్లుగా చెప్పారు. నిజంగా పోలీసులు అల్లుఅర్జున్ బెయిల్ రద్దుచేయాలని కోర్టులో పిటీషన్ వేస్తే పెద్ద సమస్యలో ఇరుకున్నట్లే. ఆ పాయింటును కోర్టు కూడా సీరియస్ గా తీసుకుంటే అల్లుఅర్జున్ మధ్యంతర బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అదే జరిగితే బన్నీ మళ్ళీ చంచల్ గూడ జైలుకు వెళ్ళాల్సిందే తప్ప వేరే దారిలేదు. బన్నీ జైలుకు పోకుండా ఎంతపెద్ద లాయర్లు ఎన్ని ప్రయత్నాలుచేసినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. పుష్పకు బెయిల్ రద్దుచేయించటాన్ని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. స్వయంగా రేవంత్ రెడ్డే(Revanth Reddy) పుష్ప విషయంలో తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. శనివారం అసెంబ్లీ సమావేశాల చివరిరోజున అల్లుఅర్జున్ పేరుపెట్టి చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి మనసు ఏమిటో తెలుసుకున్న పోలీసులు కూడా అల్లుఅర్జున్ విషయంలో అంతే సీరియస్ గా యాక్ట్ చేస్తున్నారు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే సంధ్యా ధియేటర్ ఘటన విషయం అల్లుఅర్జున్ను అంత తొందరగా వదిలిపెట్టెట్లుగా కనబడటంలేదు.

సీవీ ఆనంద్ ఏమన్నారు

సిటీ కమీషనర్ సీవీ ఆనంద్(City Commissioner CV Anand) మాట్లాడుతు బౌన్సర్లను పెట్టుకున్న సెలబ్రిటీలదే పూర్తి బాధ్యతన్నారు. బౌన్సర్ల వల్ల ప్రజలకు ఎక్కడైనా అసౌకర్యం కలిగిస్తే అందుకు బౌన్సర్లను పెట్టుకున్న వారే బాధ్యత వహించాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో పుష్ప సినిమా సమయంలో థియేటర్లో ఏమి జరిగిందనే విషయాన్ని ఆనంద్ వివరించారు. మీడియాతో ఆనంద్ మాట్లాడకుండా ధియేటర్ దగ్గర జరిగిన తోపులాటలు, తొక్కిసలాటల 10 నిముషాల వీడియోను మీడియా ముందు ప్రదర్శించారు. ఈ వీడియోను ప్రదర్శించటం ద్వారా మీడియాలో అల్లుఅర్జున్ చెప్పిందంతా అబద్ధాలే అని కమీషనర్ చెప్పకనే చెప్పేశారు. ఇక్కడితో విషయం అయిపోలేదని ముందుందని ఆనంద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Read More
Next Story