సినర్జీ ప్రమాదంలో మూడుకు చేరిన మృతుల సంఖ్య
x

సినర్జీ ప్రమాదంలో మూడుకు చేరిన మృతుల సంఖ్య

అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ పారిశ్రామిక సిటీలో ఇటీవల జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య ముగ్గురుకు చేరింది.


అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ పారిశ్రామిక సిటీలో ఇటీవల జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య ముగ్గురుకు చేరింది. విజయనగరంకు చెందిన కెమిస్ట్ సూర్యనారాయణ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. సినర్జీ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఆయన విశాఖలోని ఇండస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అనంతరం ఆయన మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఆయన కుటుంబీకులకు సమాచారం ఇచ్చినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఈనెల 23న లాల్‌సింగ్ పూరి, 24న రోయా అంగిరియా అనేవారు మరణించారు. ఈరోజు కెమిస్ట్ సూర్యనారాయణ చికిత్స పొందుతూ మృతి చెందారు.

పరిహారం ప్రకటించిన హోంమంత్రి

సినర్జీ ప్రమాద మృతుల సంఖ్య మూడుకు చేరిన నేపథ్యంలో వారి కుటుంబాలకు కూడా రూ.కోటి పరిహారం అందించనున్నట్లు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. అచ్యుతాపురం, పరవాడ ప్రమాద బాధితులకు ఆదుకునే విషయంలో తమ ప్రభుత్వం వెనకడుగు వేయలేదని చెప్పారు. కార్మికుల కుటుంబాలను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రమాదాలు జరిగిన గంటల వ్యవధిలోనే సీఎం చంద్రబాబు స్పందించి బాధితులకు భరోసా కల్పించారుని వెల్లడించారు.

ఏం జరిగిందంటే..

సినర్జిన్‌ యాక్టివ్‌ ఇంగ్రిడియన్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. అయితే సంఘటన అర్ధర్రాతి జరిగినా శుక్రవారం ఉదయం 9 గంటల వరకు బయటి ప్రపంచానికి తెలియలేదు. తీవ్రంగా గాయపడిన నలుగురు కార్మికులను విశాఖపట్నంలోని ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించి వైద్యం అందిస్తున్నారు.

ఈ కంపెనీ 24 గంటలు పనిచేస్తుంది. కార్మికులు షిఫ్ట్‌ల ప్రకారం పనిచేస్తారు. రసాయనాలు, మందులు ఈ కంపెనీలో తయారు చేస్తారు. ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప లేకుంటే ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రసాయనాలు కలిపే సమయంలో మిషనరీని చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక మెడిసిన్‌ తయారీకి కావాల్సిన రకరకాల ఉత్పత్తులను కలపాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కంపెనీలో ముడి మందును మిక్స్‌ చేసే సమయంలో వారికి ఉండాల్సిన షూట్స్‌ ఉండలేదని, యాజమాన్యం వారికి సరైన డ్రెస్‌లు ప్రొవైడ్‌ చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఘటనపై అధికారులను ఆరా తీశారు.

Read More
Next Story