ఫార్మాసిటీలో మరో ఘోరం.. నలుగురికి సీరియస్..
x

ఫార్మాసిటీలో మరో ఘోరం.. నలుగురికి సీరియస్..

అచ్యుతాపురం సెజ్‌ ప్రాంతంలోని ఎసెన్షియా ప్రమాదాన్ని మరువక ముందే అనకాపల్లి ఫార్మా సిటీలో మరో ఘోరం చోటు చేసుకుంది. పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ సంస్థలో భారీ ప్రమాదం జరిగింది.


అచ్యుతాపురం సెజ్‌ ప్రాంతంలోని ఎసెన్షియా ప్రమాదాన్ని మరువక ముందే అనకాపల్లి ఫార్మా సిటీలో మరో ఘోరం చోటు చేసుకుంది. పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ సంస్థలో భారీ ప్రమాదం జరిగింది. ఇందులో నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా వారు నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, వారిలో ఇద్దరు ప్రాణాలతో పోరాడుతున్నారని వైద్యులు చెప్తున్నారు. ఈ ప్రమాదం అర్థరాత్రి 1 గంట సమయంలో చోటుచేసుకుంది. కాగా ఈ ప్రమాద బాధితులు నలుగురు ఝార్ఖండ్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ఆరా తీసిన సీఎం

ఈ ప్రమాద సమాచారం అందిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి అక్కడి పరిస్థితులపై, బాధ్యతుల పరిస్థితిపై ఆరా తీశారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అదే విధంగా ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకునేలా దర్యాప్తు చేపట్టాలని కూడా సూచించారు. మరి కాసేపట్లో హోం మంత్రి వంగలపూడి అనిత.. అనకాపల్లి ఫార్మాసిటీకి చేరుకోనున్నారు. అక్కడ ఈ ప్రమాద క్షతగాత్రులను పరామర్శించనున్నారు. అదే విధంగా ఫార్మా సంస్థల భద్రతపై స్థానిక అధికారులతో కూడా సమావేశం కానున్నట్లు సమాచారం.

ఎసెన్షియా తరహాలోనే

అయితే సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కంపెనీలో జరిగిన ప్రమాదం కూడా ఎసెన్షియాలో జరిగిన విధంగా సంభవించినట్లు అధికారులు తమ ప్రాథమిక దర్యాప్తులో పేర్కొన్నారు. కెమికల్స్ కలుపుతున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కాగా ప్రమాద విషయాన్ని బయటకు రాకుండా యాజమాన్యం జాగ్రత్త పడింది. ఈ ప్రమాద బాధితులు దాదాపు 70శాతం కాలిన గాయాలతో ఉన్నట్లు సమాచారం. వారు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

Read More
Next Story