మరో 70 అన్న క్యాంటీన్లకు గ్రీన్ సిగ్నల్
x
అన్న క్యాంటీన్

మరో 70 అన్న క్యాంటీన్లకు గ్రీన్ సిగ్నల్

గ్రామీణ ప్రాంతాల్లో కొత్త క్యాంటీన్లను ఏర్పాటు చేయనుండగా, ఒక్కో క్యాంటీన్ నిర్మాణానికి రూ.61 లక్షలు ఖర్చు చేస్తున్నారు.


ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అన్న క్యాంటీన్‌లు ఉండేలా కూటమి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 113 నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్‌లు విజయవంతంగా నడుస్తున్నాయి.మిగిలిన 62 నియోజకవర్గాల్లో కూడా వచ్చే జనవరి నుంచి ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.కొత్తగా 70 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం ,వాటి భవనాల నిర్మాణాన్ని చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. డిసెంబరు నాటికి వీటిని సిద్ధం చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనుండగా, ఒక్కో క్యాంటీన్ నిర్మాణానికి రూ.61 లక్షలు ఖర్చు చేస్తున్నారు.

ప్రస్తుతం నిర్వహిస్తున్న 205 క్యాంటీన్లలో రోజూ మూడు పూటలా మొత్తం 1,84,500 మంది ఆహారం తీసుకుంటున్నారు. ఒక్కొక్కరిపై మూడు పూటలా కలిపి రాయితీ కింద సుమారు రూ.75 ఖర్చు చేస్తోంది. అల్పాహారంపై రూ.17, మధ్యాహ్నం భోజనంపై రూ.29, రాత్రి భోజనంపై మరో రూ.29 చొప్పున ప్రభుత్వం భరిస్తోందని అధికారులు చెబుతున్నారు.జిల్లాల వారీగా కొత్తగా మంజూరు చేసిన అన్న క్యాంటీన్ల వివరాలు.శ్రీకాకుళం5,పార్వతీపురం మన్యం1,విజయనగరం 3,అల్లూరి సీతారామరాజు 3,అనకాపల్లి 3,అంబేడ్కర్ కోనసీమ 3,తూర్పు గోదావరి 4,పశ్చిమ గోదావరి 3,కాకినాడ 2,ఏలూరు 4,గుంటూరు 5,పల్నాడు 1,ఎన్టీఆర్ 1, కృష్ణా 3,ప్రకాశం 4,శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 3,తిరుపతి 2,చిత్తూరు 7,అనంతపురం 3,శ్రీ సత్యసాయి 1,కర్నూలు 4,నంద్యాల 1,వైఎస్ఆర్ కడప 1,అన్నమయ్య జిల్లాలో 3 చొప్పున ఏర్పాటు కానున్నాయి. .ఈ అన్న క్యాంటీన్ల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాణ్యమైన ఆహారాన్ని కేవలం 5 రూపాయలకే అందిస్తూ పేదల ఆకలి తీరుస్తోంది.
Read More
Next Story